పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో( Pithapuram Assembly Constituency ) నుంచి పోటీ చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడ గెలుపును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఒకవైపు గెలుపు ధీమా ఉన్నట్టుగానే కనిపిస్తున్నా.ఉన్న మరోవైపు వైసీపీ( YCP ) నుంచి పోటీ చేస్తున్న వంగా గీత స్థానికంగా బలంగా ఉండడం, ఈ నియోజకవర్గంలో ఆమెకు విస్తృతంగా పరిచయాలు ఉండడం, ఇక్కడ తనను ఓడించేందుకు అధికార పార్టీ వైసిపి గట్టిగానే ప్రయత్నాలు చేస్తుండడం వంటివి పవన్ కు కాస్త టెన్షన్.
పుట్టిస్తూనే ఉన్నాయి.అందుకే పిఠాపురం నియోజకవర్గంలో చాలా రోజులు పాటు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.2019 ఎన్నికల్లో భీమవరం, గాజువాక( Bhimavaram, Gajuwaka ) నియోజకవర్గల్లో పోటీ చేసినా ఘోర ఓటమి తప్పలేదు.దీంతో ఈసారి కచ్చితంగా గెలిచి తీరాలనే పట్టుదలతో పవన్ ఉన్నారు.
దానికోసమే పిఠాపురం ప్రత్యేకంగా దృష్టి సారించారు.అయితే వైసిపి కూడా పవన్ ( Pawan ) ను ఓడించేందుకు సరికొత్త వ్యూహాలు సిద్ధం చేసుకుంది.
ఒకవైపు వంగా గీతను పోటీకి దించడమే కాకుండా, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం వంటి వారిని ఓ మండలానికి ఇన్చార్జిగా నియమించారు.అలాగే ఇతర కీలక నేతలకు మండలాల వారీగా బాధ్యతలను అప్పగించారు.
అయితే పవన్ విజయవకాశాలకు గండం పడే విధంగా మరో కొత్త ఎత్తుగడను వైసిపి ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది .
ఈ మేరకు పిఠాపురంలో కనుమూరి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చేత నామినేషన్ వేయించేందుకు సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. నవరంగ్ నషనల్ పార్టీ తరపున కనుమూరి పవన్ కళ్యాణ్ పోటీకి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.ఇద్దరి ఇంటిపేర్లు ఒకేలా ఉండడంతో ఓటర్లు కన్ఫ్యూజ్ అవుతారని, అలాగే జనసేన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును పోలి ఉండే విధంగా నవరంగ్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ గుర్తుగా బకెట్ ఉండడంతో ఈ టెన్షన్ మరింత ఎక్కువవుతోంది.
కచ్చితంగా కనుమూరి పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేస్తే పవన్ కళ్యాణ్ కు పడే ఓట్లకు గాంధీ పడే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తోంది.