మారకపోతే మార్చేస్తా ! ఎమ్మెల్యే లకు కేసీఆర్ వార్నింగ్ 

పనితీరు మార్చుకోమని ఇప్పటికే చాలాసార్లు చెప్పాను, సర్వే నివేదికల్లో మీ గురించి వచ్చిన రిపోర్ట్ ఏమాత్రం బాగాలేదు.పనితీరు మార్చుకోకపోతే నేనే మీ నియోజకవర్గంలో సీటును మార్చేస్తా అంటూ బీఆర్ఎస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్( CM KCR ) సొంత పార్టీ ఎమ్మెల్యేలకు హెచ్చరికలు చేస్తున్నారు.ప్రత్యక్షంగా, పరోక్షంగా వార్నింగ్ ఇచ్చిన కెసిఆర్ ఎన్నికల సమయం దగ్గరకు వస్తున్న నేపథ్యంలో మరింత స్పీడ్ పెంచారు.2018 ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరికీ సీట్లు ఇచ్చిన కేసీఆర్ ఈ ఏడాది జరగబోయే ఎన్నికల్లోను సిట్టింగ్ లకే ఎక్కువగా అవకాశం కల్పించాలని భావిస్తున్నారు.పొరపాట్లు చేస్తే తప్ప , ఈసారి ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరిని మార్చే ఉద్దేశం లేదు అంటూ ఇటీవల కెసిఆర్  వ్యాఖ్యానించారు.అయితే రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ ఎమ్మెల్యేల పరిస్థితి ఏ విధంగా ఉంది అనే విషయాలపై అనేక సర్వే సంస్థలను రంగంలోకి దించి సర్వేలు చేస్తున్నారు.

 If It Doesn't Change, I Will Change It! Kcr Warning To Mlas , Kcr, Ktr, Brs, Tel-TeluguStop.com
Telugu Brs Mlas, Telangana-Telugu Political News

పనితీరు ఏమాత్రం బాగా లేక ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల లిస్టు ను తయారు చేసుకుంటున్నారు.రాబోయే ఎన్నికల్లో పనితీరు ఆధారంగానే సీట్ల కేటాయింపు చేయాలని నిర్ణయించుకున్నారు.ఇప్పటికే పనితీరు సక్రమంగా లేని ఎమ్మెల్యేలను పిలిచి వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం.సర్వే నివేదికలు, నిఘా వర్గాల సమాచారం అన్నిటిని సదరు ఎమ్మెల్యేలు ముందు పెట్టి ఏం చేద్దాం అంటూ ఆప్షన్ వారికే ఇస్తున్నారట.

ప్రస్తుతం కెసిఆర్ హెచ్చరికలు చేసిన వారిలో 15 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు తెలుస్తోంది.మూడోసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి వచ్చి తీరాలనే పట్టుదలతో ఉన్న కేసీఆర్ దానికి అనుగుణంగానే రాజకీయ వ్యూహాలు రూపొందిస్తున్నారు.

అయితే ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో చాలామంది సీనియర్లు ఉండడంతో ఈసారి జరగబోయే ఎన్నికల్లో తమకు బదులుగా తమ వారసులకు టికెట్ ఇవ్వాలని కేసిఆర్ పై ఒత్తిడి చేస్తున్నారట.సర్వే నివేదికల ఆధారంగానే టికెట్లు కేటాయింపు ఉంటుంది అని ఇప్పటికే కేసీఆర్ స్పష్టం చేసినట్లు సమాచారం .ముఖ్యంగా శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆయన కుమారుడు పోటీకి దింపాలని భావించినా, కేసీఆర్ మాత్రం పోచారం శ్రీనివాస్ రెడ్డి ( Pocharam Srinivas Reddy )పోటీ చేయాలని సూచించారు.

Telugu Brs Mlas, Telangana-Telugu Political News

 ఇక మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ( Talasani Srinivas Yadav )తన కుమారుడికి టికెట్ కోసం ప్రయత్నించినా, కేసీఆర్ మాత్రం నిరాకరించారు.

ఇదే విధంగా రాష్ట్రవ్యాప్తంగా చాలా నియోజకవర్గాల్లో వారసులను రంగంలోకి దింపేందుకు ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రయత్నిస్తున్న కేసీఆర్ మాత్రం సీనియర్ నేతలకు అవకాశం ఇవ్వాలని చూస్తున్నారట .ప్రస్తుత పరిస్థితుల్లో ప్రయోగాల జోలికి వెళ్లడం అంత మంచిది కాదనే అభిప్రాయంతో కేసీఆర్ ఉన్నారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube