డబ్ల్యూటీసి ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా( Australia ) అద్భుత ఆటను ప్రదర్శిస్తూ భారీ స్కోర్ దిశగా ముందుకు సాగుతోంది.తొలి ఇన్నింగ్స్ లోనే ఏకంగా 496 భారీ పరుగులు చేసింది.
ఇక భారత జట్టు తొలి ఇన్నింగ్స్ లో కీలక ప్లేయర్లు తొందరగా అవుట్ కావడంతో 296 పరుగులకు పరిమితమైంది.ఇక ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసి 296 పరుగుల ఆధిక్యం లో ఉంది.
భారత జట్టు ఫీల్డింగ్ పరంగా పరవాలేదు కానీ బ్యాటింగ్ పరంగా ఘోరంగా విఫలమైంది.తొలి ఇన్నింగ్స్ లో bరవీంద్ర జడేజా, అజింక్య రహానే( Ajinkya Rahane ), శార్థూల్ ఠాగూర్ కాస్త రాణించడంతో భారత్ పీకల్లోతు కష్టాల్లో నుంచి కాస్త బయటపడింది.

ఇక రెండో ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా బ్యాటర్లను భారత బౌలర్లు బాగానే కట్టడి చేస్తున్నారు.కానీ భారత్ ఈ మ్యాచ్లో గెలవాలంటే ఖచ్చితంగా మెరుగుగైన ఆట ప్రదర్శన అవసరం.భారత బౌలర్లు మరో 100 పరుగుల లోపు ఆస్ట్రేలియా జట్టును పూర్తిగా కట్టడి చేయాల్సి ఉంది.అప్పుడే భారత్ కు గెలిచే అవకాశాలు పెరుగుతాయి.

అలాకాకుండా ఆస్ట్రేలియా జట్టు స్కోరు 400 దాటితే మాత్రం భారత జట్టుకు ఇబ్బందులు తప్పవు.ఎందుకంటే ఆస్ట్రేలియా బౌలర్ల ధాటికి తట్టుకొని భారత్ స్కోర్ 400 దాటాలంటే కష్టమే.తొలి ఇన్నింగ్స్ లోనే భారత బ్యాటర్ల సత్తా ఏంటో బయటపడింది.కాబట్టి భారత జట్టు రెండు విషయాలలో మెరుగుగా ఆటను ప్రదర్శించాలి.మొదటిది మరో 100 పరుగుల లోపు ఆస్ట్రేలియా బ్యాటర్లను కట్టడి చేసి అవుట్ చేసేయాలి.భారత టాప్ ఆర్డర్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుబ్ మన్ గిల్ (Rohit Sharma )లు అద్భుత ఆటను ప్రదర్శించాలి.
అప్పుడే రవీంద్ర జడేజా, అజింక్య రహానే, శార్థూల్ ఠాగూర్ లపై కాస్త ఒత్తిడి తగ్గి భారత్ వికెట్లను కోల్పోతున్న కూడా కచ్చితంగా టైటిల్ భారత్ స్వంతం అవుతుంది.







