కథ దొరికితే తప్పకుండా జూనియర్ ఎన్టీఆర్ తో నటిస్తా - కళ్యాణ్ రామ్

మంచి కథ దొరికితే తప్పకుండా జూనియర్ ఎన్టీఆర్ తో నటించేందుకు సిద్దంగా ఉన్నట్లు సినీ నటుడు నందమూరి ‌కళ్యాణ్ రామ్ చెప్పారు.ఇవాళ ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో తిరుమల శ్రీవారిని కళ్యాణ్ రామ్, బింబిసార మూవీ టీంతో కలిసి స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు.

 If I Get The Story, I Will Definitely Act With Jr. Ntr - Kalyan Ram Jr. Ntr ,-TeluguStop.com

అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.

అనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన కళ్యాణ్ రామ్ మీడియాతో మాట్లాడుతూ.

ఆగస్టు 5వ తేదీన బింబిసార చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతుందని, సినిమా విజయవంతం కావాలని స్వామి వారిని ప్రార్ధిస్తూ, స్వామి వారి ఆశీస్సుల కోసం తిరుమలకు రావడం జరిగిందన్నారు.కధ వస్తే కచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ తో నటిస్తానన్నారు.

తిరుమలలో రాజకీయ ప్రస్తావన మాట్లాడడానికి కళ్యాణ్ రామ్ నిరాకరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube