అంతా అవినీతే.. హైదరాబాద్‎కి ప్రత్యేక స్థానం?

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో అవినీతి రాజ్యమేలుతోంది.ఆట గాళ్ల సెలక్షన్స్ నుంచి క్రికెట్ సామాగ్రి కొనుగోలు వరకూ అవతవకలకు హద్దేలేకుండా పోయింది.

 If Everything Is Wrong  A Special Place For Hyderabad , Hyderabad  ,  Special Pl-TeluguStop.com

కాసులు ఉంటే చాలు టీమ్ లో సెలక్ట్ అయిపోవచ్చు.దీంతో టాలెంట్ ఉన్న ఆటగాళ్లు మాత్రం గల్లీ క్రికెట్ కే పరిమితం కావాల్సి వస్తోంది.

పరిస్థితి ఇంతగా దిగజారిపోవడానికి అజరుద్దీనే కారణమనే ఆరోపణలు వస్తున్నాయి.అజరుద్దీన్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

భారత్ క్రికెట్ చరిత్రలో హైదరాబాద్ కి ప్రత్యేక స్థానముండేది.ఇక్కడ నుంచి వెళ్లిన అనేక మంది క్రికెటర్లు రికార్డులు సృష్టించారు.ఇది గతం.కానీ ఇప్పుడు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అంటేనే అవినీతి కూపంగా అభివర్ణిస్తున్నారు కొంత మంది క్రీడాకారులు.దాదాపు పదేళ్ల నుంచి ఏ ఒక్క క్రికెటర్ టీమిండియాకు ఎంపిక కాలేదంటే పరిస్థితులను అర్థం చేసుకోవచ్చు.చివరికి రంజీలో సత్తా చాటుకున్న వారు కూడా హైదరాబాద్ టీమ్ కి ఆడకుండా దేశంలోని ఇతర ప్రాంతాలకు వెళ్లి తమ సత్తా చాటు కుంటున్నారు.

Telugu Azaruddin, Bcci, Bjp Vivek, Hyderabad, Cricket, Ranji Game, Place Hyderab

ప్రతిభ ఆధారంగా కాకుండా క్యాష్ కొడితేనే టీమ్ లో సెలక్ట్ చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.జిల్లా క్రికెట్ మ్యాచ్ ఆడాలంటే 25 లక్షలు,రంజీ మ్యాచ్ లో సెలక్ట్ అవ్వాలంటే 50 లక్షలు తీసుకుంటున్నారంటే పరిస్థితులు ఎంత గా దిగజారిపోయాయో అర్థం చేసుకోవచ్చు. అజారుద్దీన్ నాయకత్వంలో ఇదంతా జరుగుతుందని ఆరోపణలు వస్తున్నాయి.

Telugu Azaruddin, Bcci, Bjp Vivek, Hyderabad, Cricket, Ranji Game, Place Hyderab

అజారుద్దీన్ పై గతంలో మ్యాచ్ ఫిక్స్ంగ్ ఆరోపణలు వచ్చాయి.అప్పట్లో అజార్ నుబ్యాన్ కూడా చేశారు.అజారుద్దీన్ గుత్తాధిపత్యంతో వ్యవహరిస్తూ తనకున్న పలుకుబడితో బీసీసీఐని కూడా మేనేజ్ చేస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి.

అజారుద్దీన్ అవినీతిపై గతంలో బీజేపీ నేత వీవేక్ పోరాడారు.అజారుద్దీన్ పై అవినీతిపై ఏసీబీ అధికారులు ఎందుకు స్పందించడంలేదని క్రీడాకారులు అంటున్నారు.

Telugu Azaruddin, Bcci, Bjp Vivek, Hyderabad, Cricket, Ranji Game, Place Hyderab

ముఖ్యంగా అజారుద్దీన్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కి ప్రెసిడెంట్ అయిన తరువాత పరిస్థితులు దారుణంగా తయారయ్యాయని క్రికెటర్స్ అంటున్నారు.ఎక్కడ చూసినా అవినీతి కంపు కొడుతుందంటున్నారు.సెలక్షన్స్ దగ్గర నుంచి క్రికెటర్స్ కావాల్సిన కిట్స్ కొనడందాకా అంతా అవినీతిమయమే.అసలు హెచ్ సీఏలో జవాబుదారి తనం లేకుండా పోయింది.నియంతృత్వం రాజ్యమేలుతోంది.అసలు అజారుద్దీన్ మీద బీసీసీఐ ఎందుకు చర్యలు తీసుకోవడంలేదో అర్థం కావడంలేదు.

అతనికి ఉన్న పలుకుబడితో బీసీసీఐని కూడా మేనేజ్ చేస్తున్నాడు.

దేశంలో యూత్ కి క్రికెట్ అనేది జీవనవిధానంలో ఒక భాగం.

గ్రామీణ స్థాయిలో ప్రతిభ ఉన్న క్రీడాకారులను గుర్తించి వారిని తీర్చిదిద్దాలి.కానీ ప్రతిభను కాకుండా కాసులన్నవారికే ప్రాధాన్యత నివ్వడం చాలా విచారకరం.

ఇకనైనా హెసీఏలో జరుగుతున్న అవినీతిపై బీసీసీఐ దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకోవాలని క్రీడాకారులు కోరుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube