ప్రస్తుతం రాజకీయ పార్టీలు వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకుంటున్నాయి.తమ అవసరాలకు అనుగుణంగా వాటి చేత పనిచేయించుకుంటున్నాయి.
రాజకీయంలో ఇప్పుడు ఇవి సర్వసాధారణం అయిపోయాయి.ప్రత్యర్థులను దారిలోకి తెచ్చుకోవటానికి ఒక్కో సారి కొన్ని వ్యవస్థలను వాళ్లపై ప్రయోగించి తమ దారిలోకి వచ్చేలా చేసుకుంటాయి.
ఇక అధికారం చేతిలో ఉంటే వ్యతిరేకుల మీద ప్రయోగించి తమకు అనుకూలంగా మార్చుకునే ధోరణి మొదలు పెట్టింది కాంగ్రెస్సే అయినా.ఆ తర్వాతి కాలంలో అధికారంలోకి వచ్చిన వారు వాడేస్తున్న తీరు.
అందుకు అనుసరిస్తున్న విధానాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్నాయి.రోజురోజుకి పెరుగుతున్న రాజకీయ పరిణామాలకు తగ్గట్లు అధికార పక్షాలు అనుసరిస్తున్న విధానాలపై ఆందోళన వ్యక్తమవుతోంది.
ఇది ఇలాగే కొనసాగితే వ్యవస్థలు నిర్వీర్యం అవుతాయిని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇక కేంద్రంలోని మోడీ షాలు తమ రాజకీయ ప్రత్యర్థులపై ఈడీ.సీబీఐలను ప్రయోగిస్తున్నారంటూ తెలంగాణ ముఖ్యమంత్రితో సహా కాంగ్రెస్, దేశంలోని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.తమ దారికి తెచ్చుకోవటానికి ఈడీని.
సీబీఐని అస్త్రాలుగా వాడుతున్న తీరు ఇదివరకు ఏ ప్రభుత్వ కూడా చేయలేదని అంటున్నారు.అయితే ఇలాంటి విమర్శలు.
రాజకీయ పార్టీలు సైతం తాము అధికారంలో ఉన్నప్పుడు చేసినవే.కానీ ప్రస్తుతం మితిమీరిపోతుందనే వాదన వినిపిస్తోంది.
ఈ వాదనకు బలం చేకూరే పరిస్థితులు ఇప్పుడు కనిపిస్తున్నాయి.కేంద్రంలోని మోడీ సర్కారు తన రాజకీయ ప్రత్యర్థుల లెక్క తేల్చేందుకు వారిని దారికి తెచ్చుకునేందుకు ఈడీని విరివిగా వాడేస్తుందన్న మాట బలంగా వినిపిస్తుండగా రాష్ట్రంలో అధికార పార్టీ సైతం మేం తక్కువేం కాదన్న రీతిలో ఉందని అంటున్నారు.
ఇక ప్రస్తుతం మునుగోడు ఉప ఎన్నిక రాష్ట్రంలో ముచ్చెమటలు పట్టిస్తోంది.ప్రధాన పార్టీలు అన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి.ఇక ఇదిలా ఉంటే అధికార పార్టీపై ఒత్తిడి పెంచేందుకు.వారిలో ఆందోళనను పెంచేందుకు వీలుగా బీజేపీ పావులు కదుపుతోంది.అయితే తమ నేతల్ని పార్టీ వీడిపోయేలా చేస్తున్న బీజేపీకి షాకిచ్చే ప్రయత్నాల్ని టీఆర్ఎస్ ముమ్మరం చేస్తోంది.ఇందులో భాగంగానే తమ పార్టీకి చెందిన నేతలను భయపెట్టడానికి పాత కేసుల్ని బయటకు తీస్తుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
మునుగోడు ఉప ఎన్నిక బరిలో టీఆర్ఎస్ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని రంగంలోకి దించాలని సీఎం కేసీఆర్ భావించటం.దానిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అసమ్మతి వినిపించడం తెలిసిందే.
దీంతో పలువురు నేతలను కేసీఆర్ బుజ్జగించడం… అయినప్పటికీ వారు తమ తీరును మార్చుకోకపోవటంతో వారికి నాయకత్వం వహిస్తున్న వారెవరు.? అన్న విషయాన్ని గుర్తించి టార్గెట్ చేస్తున్నట్లు చెబుతున్నారు.
పాత కేసులు తోడి అసమ్మతి నాయకత్వం వహిస్తున్న వారిలో చౌటుప్పల్ ఎంపీపీ తాడూరి వెంకటరెడ్డిని దారికి తెచ్చుకోవటానికి వీలుగా ఆయనపై పాత కేసుల్ని తెర మీదకు తెచ్చారని.ఇందులో భాగంగా ఆయన్ను సోమవారం రాత్రి అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు చేసినట్లుగా చెబుతున్నారు.
దీంతో ముందస్తు జాగ్రత్తలో భాగంగా అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయిన ఆయన మంగళవారం బీజేపీ తీర్థాన్ని పుచ్చుకున్నట్లు చెబుతున్నారు.ఇంతకాలం ఎంపీపీ మీద ఉన్న కేసుల విషయంలో పోలీసులు పట్టనట్లుగా వ్యవహరిస్తూ.
తాజాగా మాత్రం అందుకు భిన్నంగా యాక్టివ్ కావటం గమనార్హం.అంతేకాదు.
కొందరు రైతులు వెంకట్ రెడ్డి దౌర్జన్యంగా తమ భూముల్ని పట్టా చేయించుకున్నారంటూ ధర్నాకు దిగటం కూడా రాజకీయమే అన్న మాట వినిపిస్తోంది.
ఆయనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో వెంకట్ రెడ్డిని అరెస్టు చేసేందుకు పోలీసులు సివిల్ డ్రెస్ లో వెళ్లగా.
ఇంట్లో ఉన్నఆయన బయటకు రావటానికి అభ్యంతరం వ్యక్తం చేశారని చెబుతున్నారు.దీంతో స్థానికంగా ఉన్న బీజేపీ నేతలకు సమాచారం ఇవ్వటంతో వారంతా వెంకట్ రెడ్డి ఇంటికి వచ్చి ముందస్తు నోటీసులు లేకుండా రాత్రిపూట అరెస్టు చేయటం ఏమిటని ప్రశ్నించటంతో పోలీసులు వెళ్లిపోయారని చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో మంగళవారం బీజేపీ చేరికల కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ ఇంటికి వెళ్లిన వెంకట్ రెడ్డి కాషాయ కండువా కప్పుకోవటం గమనార్హం.దీంతో కేంద్రంలో ఈడీ.సీబీఐ.రాష్ట్రంలో పోలుసులతో నేతలను తమ దారికి తెచ్చుకుంటున్నారనే వాదన వినిపిస్తోంది.