సఖినేటిపల్లి మండలం టేకిశెట్టిపాలెం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రావు పాల్గొని ఇంటింటికీ తిరిగి సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఫలాలు అందరికీ అందుతున్నాయా లేదా అడిగి తెలుసుకున్నారు.పేదలకు ఎంతో ఉపయోగపడే కళ్యాణమస్తు పధకం ప్రవేశ పెట్టిన సందర్భంగా కార్యకర్తలతో కలిసి సీఎం జగన్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా రాపాక మీడియాతో మాట్లాడుతూ.
సీఎం జగన్ మాటిస్తే మడం తిప్పడని ప్రశంసించారు.సీఎం తన పాదయాత్ర ద్వారా తమ దృష్టికి వచ్చిన సమస్యలన్నీ మానిఫెస్టోలో 98.4% అమలు చేసి రాజకీయ పార్టీలు ఏ పార్టీ అమలు చేయని విధంగా మానిఫెస్టో అమలు చేసిన ఘనత కేవలం జగన్మోహన్ రెడ్డి కి మాత్రమే దక్కుతుందన్నారు.ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న ఏ పధకం కూడా ఆపలేదని అన్నారు.అక్టోబర్ 1 నుంచి అమలు లోకి రానున్న కళ్యాణమస్తు – షాదీ ముబారక్ పధకం బడుగు బలహీన, మైనార్టీ వర్గాలకు ఎంతో అండగా ఉంటుందన్నారు.
గత ప్రభుత్వం కంటే రెట్టింపు నగదుతో పేదల ఇళ్లల్లో శుభకార్యాలకు మంచి తోడ్పాటు అవుతుందని అన్నారు.ఇలా నిరంతరం ప్రజా మన్ననలతో ,ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న జగన్ ని రాబోయే ఎన్నికల్లో భారీ మెజారిటీతో సీఎం చేయడమే ద్యేయంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపి వీరా మల్లిబాబు, జెడ్పీటీసీ అన్నపూర్ణ మరియు అధికారులు, పార్టీ నేతలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.