మురగదాస్ డైరెక్షన్ లో ఐకాన్ స్టార్... క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ మురగదాస్!

సాధారణంగా ఇండస్ట్రీలో కొందరు డైరెక్టర్లు హీరోల హిట్ కాంబినేషన్ ఉంటుంది.ఆ కాంబినేషన్లో సినిమాలు కనుక వస్తే పక్కా హిట్ అని క్లారిటీ ప్రతి ఒక్క ప్రేక్షకుడిలోనూ ఉంటుంది.

 Icon Star In Muragadas Direction Director Muragadas Gave Clarity ,rajinikanth ,a-TeluguStop.com

ఇలాంటి హిట్ కాంబినేషన్లో బాలయ్య- బోయపాటి ఒకటి, గోపీచంద్ మలినేని – రవితేజ కాంబినేషన్ , పవన్ – త్రివిక్రమ్ ఇలా కొన్ని కాంబినేషన్లో కనక సినిమాలు వస్తే మంచి హిట్ అవుతాయని భావిస్తారు.అయితే మరికొన్నిసార్లు అసలు ఊహించని డైరెక్టర్లతో కొందరి హీరోలు సినిమాలు చేస్తూ ఉంటారు.

ప్రస్తుతం అలాంటి కాంబినేషన్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Telugu Allu Arjun, Darbar, Muragadas, Rajinikanth-Movie

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో డైరెక్టర్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న మురుగదాస్( Muragadas ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.మురగదాస్ సినిమా అంటే కమర్షియల్ హంగులతో పాటు సమాజాన్ని ఆలోచింపజేసే అంశాలను కూడా మేళవింపజేస్తాడు.అయితే గత కొంతకాలంగా ఇండస్ట్రీకి ఈయన దూరంగా ఉంటున్నారు ఈయన చివరిగా రజనీకాంత్( Rajinikanth ) నటించిన దర్బార్( Darbar ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

తాజాగా అతడు నిర్మించిన ’16 ఆగస్టు 1947′ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మురుగదాస్ హైదరాబాద్ వచ్చారు.

Telugu Allu Arjun, Darbar, Muragadas, Rajinikanth-Movie

ఇలా హైదరాబాదులో ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి మురగదాస్ గారికి ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురయింది.మీరు అల్లు అర్జున్ తో( Allu Arjun ) సినిమా చేయబోతున్నారట ఇందులో ఎంతవరకు నిజం ఉంది అంటూ ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు ఈయన సమాధానం చెబుతూ ఎంతో మంది హీరోలు దర్శకులను కలుస్తూ ఉంటారు.

దర్శకులు కూడా హీరోలను కలుస్తూ ఉంటారు.అయితే ఏదో ఒక దశలో వారి ప్రాజెక్టు మొదలవుతుంది.

ప్రస్తుతం మా ప్రాజెక్టు తొలి దశలోనే ఉంది ఇంతకుమించి నేను ఏమి చెప్పలేను అంటూ మురుగదాస్ ఈ విషయం గురించి వెల్లడించారు.ఇలా మా ప్రాజెక్టు తొలి దశలోనే ఉంది అంటూ మురగదాస్ చేసినటువంటి కామెంట్స్ కనుక చూస్తే పక్కాగా వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుంది అని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube