ఐకాన్ స్టార్ కు అరుదైన గౌరవం.. ఇలా జరగడం ఇదే తొలిసారి!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్.ఈయన గురించి తెలియని సినీ ప్రేక్షకుడు లేరు.

 Icon Star Allu Arjun Represented India , Pushparaj, Allu Arjun, Pushpa 2 , Direc-TeluguStop.com

అంతలా ఈయన తన నటనతో ఆకట్టుకున్నాడు.పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోల లిష్టులో చేరిపోయాడు.

పుష్ప కంటే ముందు ఈయనకు కేవలం సౌత్ లో మాత్రమే ఫాలోయింగ్ ఉంది.అయితే ఇప్పుడు అలా కాదు.

ఈయనకు రోజురోజుకూ ఫాలోయింగ్ పెరిగి పోతుంది.

అల్లు అర్జున్ హీరోగా ట్యాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శత్వంలో తెరకెక్కిన సినిమా పుష్ప ది రైజ్.

నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన పుష్ప సినిమా గత ఏడాది రిలీజ్ అయ్యి అన్ని రికార్డులను తిరగ రాసింది.హిందీలో కూడా వసూళ్ల సునామీ సృష్టించింది.

అక్కడ ఎటువంటి ప్రొమోషన్స్ లేకుండానే 100 కోట్లు కలెక్ట్ చేసింది.

దీంతో ఈయన క్రేజ్ వరల్డ్ వైడ్ గా మారింది.

ఇదే క్రేజ్ తో ఈయన అరుదైన అవకాశాన్ని సొంతం చేసుకున్నాడు.అమెరికాలో స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇండియా డే పరేడ్ వేడుక అల్లు అర్జున్ సారథ్యంలో జరిగింది.

ఈ వేడుకకు అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి తో కలిసి హాజరయ్యారు.ఈ వేడుకలో 5 లక్షల మందికి పైగానే భారతీయులు హాజరయ్యారు.

ఇంత స్థాయిలో రావడం ఇదే మొదటిసారి అని ఇది ఒక రికార్డ్ అని అంటున్నారు.

Telugu Allu Arjun, Sukumar, Iconallu, Pushpa, Pushparaj-Movie

ఇక ఈ సందర్భంగా మరో అరుదైన ఘటన కూడా జరిగింది.ఈ వేడుక లో న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ కూడా పాల్గొన్నారు.ఈ సందర్భంగా అల్లు అర్జున్ హుక్ స్టెప్ తగ్గేదేలే చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేసారు.

దీనిని బట్టే అర్ధం అవుతుంది అల్లు అర్జున్ క్రేజ్ ఎక్కడి వరకు వెళ్లిందో.ఇక పుష్ప సినిమా పార్ట్ 1 ఘన విజయంతో కావడంతో ఇప్పుడు పార్ట్ 2 తెరకెక్కించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube