ముందు నుండి మన టాలీవుడ్ లో స్టైలిష్ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు అల్లు అర్జున్.ఈయన తన స్టైలిష్ ను సినిమా సినిమాకు మారుస్తూ ప్రేక్షకుల మదిలో నిలిచి పోయాడు.
పుష్ప సినిమా కంటే ముందునే మన సౌత్ లో అల్లు అర్జున్ కు బీభత్సమైన ఫాలోయింగ్ ఉంది.ఇక ఎప్పుడైతే పుష్ప రిలీజ్ అయ్యిందో అప్పటి నుండి ఈయన రేంజ్ మారిపోయింది అనే చెప్పాలి.
పుష్ప సినిమా తర్వాత అల్లు అర్జున్ కు నార్త్ లో కూడా బాగా ఫాలోయింగ్ పెరిగి పోయింది.ఈ సినిమాతో గ్లోబల్ వైడ్ గా పేరు తెచ్చుకుని పాన్ ఇండియా స్టార్ గా వెలుగొందు తున్నాడు.
ఇదిలా ఉండగా తాజాగా అల్లు అర్జున్ తన ట్విట్టర్ లో ప్రొఫైల్ పిక్ మార్చేశారు.ఈ పిక్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.ఈ పిక్ లో అల్లు అర్జున్ బ్లాక్ షర్ట్ లో కర్లీ హెయిర్ తో ఎంతో స్టైలిష్ గా కనిపిస్తూ ఫ్యాన్స్ ను అలరిస్తున్నాడు.
ఈ పిక్ ఇప్పుడు నెట్టింట తెగ షేర్ అవుతుంది.అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంతా ఈయన కొత్త లుక్ కు ఫిదా అవుతున్నారు.అయితే ఈ లుక్ గురించి మరో చర్చ కూడా జరుగుతుంది.
ప్రెజెంట్ అల్లు అర్జున్ పుష్ప 2 చేస్తున్నాడు.మరి పార్ట్ 2 లో అల్లు అర్జున్ ఈ నయా లుక్ లో కనిపిస్తాడా అనే ఆసక్తికర చర్చ జరుగుతుంది.
మొదటి పార్ట్ సూపర్ హిట్ అవ్వడంతో రెండవ పార్ట్ ను మరింత గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు.
అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ 350 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు అని టాక్.ప్రెజెంట్ శరవేగంగా షూటింగ్ జరుపు కుంటున్న ఈ సినిమాలో మరింత భారీ తారాగణాన్ని కూడా తీసుకుంటూ ఈసారి 1000 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగనున్నారు.అన్ని అనుకున్న విధంగా జరిగితే ఈ ఏడాది డిసెంబర్ లో రిలీజ్ చేసే అవకాశం ఉంది.






