క‌రోనా లాక్‌డౌన్‌ ఎత్తివేత‌పై ఐసీఎంఆర్ కీల‌క వ్యాఖ్య‌లు.. !

దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కరోనా కట్టడికి లాక్‌డౌన్ అమలు చేసున్న విషయం తెలిసిందే.దీని వల్ల కరోనా వ్యాప్తి అనేది కొంత మేరకు తగ్గిపోయింది.

ఈ నేపధ్యంలో లాక్‌డౌన్ క్రమక్రమంగా ఎత్తివేయాల‌ని రాష్ట్రాలు చూస్తున్నాయి.ఇక దేశంలో కరోనా కేసులు త‌గ్గుముఖం ప‌డుతున్నప్పటికి యాక్టీవ్ కేసులు, లెక్కలోకి రాని కేసులు యధాతధంగా ఉన్నాయి.

Icmr Key Comments On Corona Lock Down Lifting, ICMR, Key Comments, Corona, Lock

అయితే ప్రభుత్వాలు లాక్‌డౌన్ ఎత్తివేస్తే మాత్రం పరిస్దితులు మొదటికి వస్తే మాత్రం తట్టుకోవడం కష్టం.ఇక ఇదే అంశం పై ఐసీఎంఆర్ కీల‌క వ్యాఖ్య‌లు చేసింది.

క‌రోనా లాక్‌డౌన్‌ ఎత్తివేసే తరుణంలో మూడు అంశాల ప్ర‌ణాళిక‌ను వెల్ల‌డించింది.మొదటగా కోవిడ్ త‌క్కువ పాజిటివిటి రేటు ఉన్న ఏరియాలను గుర్తించాలని, అత్య‌ధిక మందికి కరోనా వ్యాక్సిన్స్ అందేలా చూడాలని వెల్లడించారు.

Advertisement

ఇకపోతే కోవిడ్ ముప్పు అధికంగా ఉన్న వ‌ర్గాల‌కు 70శాతానికి పైగా వ్యాక్సిన్ టీకాలు వేసి కోవిడ్ నిబంధ‌న‌లు ఖచ్చితంగా అమలు అయ్యేలా చూస్తే ఇంటువంటి ప్రాంతాల్లో లాక్‌డౌన్ ను ఎత్తివేయ‌వ‌చ్చ‌ని ఐసీఎంఆర్ ఛీఫ్ బ‌ల‌రాం భార్గ‌వ తెలియచేసారు.అయినా ప్రజలు బాధ్యతగా వ్యవహరిస్తే కరోనా కట్టడి ఏమంత కష్టం కాదు.

ముక్కు దిబ్బడతో బాధ‌ప‌డుతున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసం!
Advertisement

తాజా వార్తలు