నెదర్లాండ్స్ ను పసికూన అనుకుంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే..ఈ జట్టు బలాలు ఇవే..!

భారత్ వేదికగా జరగనున్న వన్డే వరల్డ్ కప్ టోర్నీలో( ICC World Cup 2023 ) పాల్గొనే జట్లలో చిన్న జట్టుగా నెదర్లాండ్స్ ను( Netherlands ) చెప్పుకోవచ్చు.అయితే నెదర్లాండ్స్ ను పసికూన అనుకుంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే.

 Icc World Cup 2023 Five Prominent Netherlands Players Who Can Make An Impact In-TeluguStop.com

నెదర్లాండ్స్ జట్టులోని ఈ ఐదుగురు ఆటగాళ్లు మ్యాచ్ ను కీలక మలుపు తిప్పగలరు.కాబట్టి ఏ జట్టును కూడా తక్కువ అంచనా వేయకుండా ఆరంభం నుండి గట్టి పోటీ ఇస్తేనే మ్యాచ్ గెలిచే అవకాశం ఉంటుంది.నెదర్లాండ్స్ జట్టులోని ఐదుగురు కీలక ఆటగాళ్ల గురించి తెలుసుకుందాం.

మాక్స్ ఓ డౌడ్:

నెదర్లాండ్స్ జట్టులో టాప్ ఆర్డర్ ప్లేయర్.ఇతను( Max O’Dowd ) 33 వన్డేలు ఆడి 1158 పరుగులు చేశాడు.ఇందులో 10 అర్థ సెంచరీలు ఉన్నాయి.ఇతని అత్యధిక స్కోర్ 90 పరుగులు.

స్కాట్ ఎడ్వర్డ్:

నెదర్లాండ్స్ జట్టు కెప్టెన్.( Scott Edwards ) ఇప్పటివరకు 38 వన్డే మ్యాచ్లు ఆడి 1212 పరుగులు చేశాడు.ఇందులో 13 అర్థ సెంచరీలు ఉన్నాయి.ఇతని అత్యధిక స్కోర్ 86 పరుగులు.

Telugu Bas De Leede, Cricket Cup, Icc Cup, Max Odowd, Netherlands, Roelofvan, Sc

తేజ నిడమనూరు:

నెదర్లాండ్స్ జట్టులో ఓ కీలక ఆటగాడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.వరల్డ్ కప్ క్వాలిఫైయింగ్ మ్యాచ్లో నెదర్లాండ్స్ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.ఆ మ్యాచ్లో 76 బంతుల్లో 111 పరుగులు చేసి జట్టును గెలిపించాడు.20 వన్డేలు ఆడి 511 పరుగులు చేశాడు.అందులో రెండు సెంచరీలు ఉన్నాయి.

బేస్ డీ లైడ్:

నెదర్లాండ్స్ జట్టు ఆల్రౌండర్. ఏ క్షణంలోనైనా మ్యాచ్ ను మలుపు తిప్పే సామర్థ్యం కలిగి ఉన్నాడు.ఇప్పటివరకు 30 వన్డేలు ఆడి 765 పరుగులు చేశాడు.ఇందులో ఒక సెంచరీ, రెండు అర్థ సెంచరీలు ఉన్నాయి.ఇక బౌలింగ్ విషయానికి వస్తే.ఇప్పటివరకు 24 వికెట్లు తీశాడు.

Telugu Bas De Leede, Cricket Cup, Icc Cup, Max Odowd, Netherlands, Roelofvan, Sc

రోలోఫ్ వాన్ డెర్ మెర్వే:

నెదర్లాండ్ జట్టు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలర్.జట్టు పీకల్లోతు కష్టాల్లో ఉంటే బౌలింగ్ తో మ్యాచ్ ను మలుపు తిప్పే సత్తా కలిగి ఉన్నాడు.16 మ్యాచులు ఆడి 19 వికెట్లు తీశాడు.ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే ఒక అర్థ సెంచరీ సాధించాడు.

ప్రత్యర్థి జట్లు ఈ నెదర్లాండ్ జట్టును తక్కువగా అంచనా వేస్తే భారీ మూల్యం చెల్లించుకోవలసిందే.వరల్డ్ కప్ గెలుస్తుంది అని చెప్పలేము కానీ సెమీఫైనల్ కు చేరే జట్ల ఫలితాలను తారుమారు చేసే సత్తా నెదర్లాండ్ కు ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube