ఒకప్పుడు పేపర్ బాయ్.. ఇప్పుడు ఐఏఎస్.. పొలం పనులు చేస్తూనే లక్ష్యం సాధించి?

ఈతరం యువతలో చాలామంది కెరీర్ పరంగా అంచెలంచెలూ ఎదుగుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు.

ఒకప్పుడు పేపర్ బాయ్ గా( Paper Boy ) పని చేసి ఇప్పుడు జీవీఎంసీ కమిషనర్ గా( GVMC Commissioner ) పని చేస్తున్న డాక్టర్ లక్ష్మీశా( IAS Lakshmisha ) ఐఏఎస్ గా ఎదిగే క్రమంలో తనకు ఎదురైన ఇబ్బందులు, సవాళ్ల గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

కర్ణాటకలోని హోలుగుండనహళ్లిలో జన్మించానని అమ్మ, నాన్న కూలిపనులు చేసేవారని ఆయన తెలిపారు.అన్నయ్య, నేను తిన్న తర్వాత అమ్మ తినేదని మొదట వ్యవసాయ శాస్త్రవేత్తగా ఆ తర్వాత ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ గా ఆ తర్వాత ఐఏఎస్ అధికారిగా లక్ష్మీశా పని చేశారు.

బీఎస్సీ అగ్రికల్చర్ చదివి జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ రావడంతో ఎమ్మెస్సీ కోసం అలహాబాద్ కు వెళ్లానని అగ్రికల్చర్ యూనివర్సిటీలో సైంటిస్ట్ గా కెరీర్ ను మొదలుపెట్టి మధ్యలో సైకాలజీ కూడా చదివానని ఆ సమయంలో జీవితం మలుపు తిరిగిందని ఆయన పేర్కొన్నారు.

నా లైఫ్ ఎక్కడ మొదలైందో నేను ఎప్పటికీ మరిచిపోలేనని సమాజానికి సేవ చేయాలనే ఆలోచనతో మళ్లీ కష్టపడి ఐఏఎస్ అయ్యానని ఆయన చెప్పుకొచ్చారు.పార్వతీపురంలో ఉన్న గిరి గ్రామాలను చూస్తే సొంతూరిలో ఉన్నట్టు అనిపించిందని ఆయన చెప్పుకొచ్చారు.2009లో సివిల్స్ రాసినా ఆశించిన ఫలితం రాలేదని 2010లో ఐ.ఎఫ్.ఎస్ కు ఎంపికయ్యానని ఆయన తెలిపారు.

Advertisement

2013 సంవత్సరంలో 275 ర్యాంకు సాధించి ఏపీ క్యాడర్ కు ఎంపికయ్యానని లక్ష్మీశా వెల్లడించారు.నూజివీడు సబ్ కలెక్టర్ గా, పార్వతీపురం ఐటీడీఏ పీవోగా పని చేశానని ఆయన చెప్పుకొచ్చారు.చిన్నప్పుడు అమ్మానాన్నలతో కలిసి పొలం పనులకు వెళ్లేవాడినని 300 రూపాయల వేతనాననికి పేపర్ బాయ్ గా పని చేశానని లక్ష్మీశా పేర్కొన్నారు.

ఐఏఎస్ ఆఫీసర్ లక్ష్మీశా చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు