ప్రజల ఆశీర్వధాలతో నేను గెలిచాను-రోహిత్ ఎమ్మెల్యే

ప్రజలకు నిజాలు తెలుసు.ఇలాంటి నీచమైన రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు.

 I Won With The Blessings Of The People , Rohit Mla , People , Tandoor Constitu-TeluguStop.com

ప్రజల ఆశీర్వధాలతో నేను గెలిచాను.ప్రజలను రౌడీలు అంటే ఎలా? నా పక్కన ఎవరైనా రౌడీ షీట్ ఉంటే ఆ కాపీ చూపించాలి. తాండూరు నియోజకవర్గంలో టీఆరెస్ జెండా మోసింది నేను.టికెట్ విషయంలో ఆయన టీడీపీ నుంచి వచ్చారు.టీఆరెస్ పార్టీ తోనే నా రాజకీయ అరంగ్రేటం చేసాను.ఫ్రస్టేషన్ లో మహేందర్ రెడ్డి మాట్లాడుతుండు.

మా తరపున ఎలాంటి గొడవలు చేయలేదు.నేను సిఐని తిట్టలేదు అంటే ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా.

ఈ ఘటన అధిష్టానం దగ్గరకు తీసుకెళ్లలేదు.తప్పకుండా తీసుకెళ్తా.

నేను ఎవరిని వేధించడం లేదు.సర్పంచ్ లు సస్పెండ్ కావడానికి నేను కారణం కాదు.

వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ లకె టికెట్లు అని సీఎం- కేటీఆర్ చెప్తున్నారు.

టీఆరెస్ హవా నడిచినా నన్ను తాండూరు ప్రజలు నన్ను గెలిపించారు.

రీసెంట్ గా చేసిన సర్వేల్లో నాకే మొగ్గు వచ్చింది.వందశాతం తాండూరు టికెట్ నాదే.

ప్రజలకు నేను ఎమ్ చేసాను అనేది తెలుసు.పార్టీ అధిష్టానానికి గెలుపు గుర్రాలు కావాలి.

అది నేనే.మహేందర్ రెడ్డి పార్టీ మారుతారా లేదా అనేది నాకు తెలీదు.

నాకు మహేందర్ రెడ్డి ప్రత్యర్థి కాదు.నాకు ఆయనతో గొడవ పడాల్సిన అవసరం లేదు.

మహేందర్ రెడ్డి ప్రోటోకాల్ పాటించడం లేదు.జిల్లా మంత్రి దృష్టిలో ఉంది.

గతంలో మంత్రి సమక్షంలో గొడవలు జరిగాయి.తాండూరు నియోజకవర్గంలో ఇసుక దందా లేదు.

టీఆరెస్ అధిష్టానం ఆదేశాలను తుశాతప్పకుండా పాటిస్తున్నాను.మనస్సులో ఏదో పెట్టుకోని గొడవలు చేస్తే దానికి నేను కారణం కాదు పోలీసులకు మా మద్దతు ఉంటుంది.

ఆయన మనస్తాపానికి గురైయ్యారు.మహేందర్ రెడ్డి సీనియర్ నాయకుడు.

ఆయనకు నేను మర్యాద ఇస్తూనే ఉన్నాను.మహేందర్ రెడ్డి నాకు సుట్టం.

దగ్గర బంధువు.నాకు తాండూరు లో ఎలాంటి వ్యాపారాలు లేవు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube