టీపీసీసీకి అధ్యక్ష పదవికి ఉత్తమ్ రాజీనామా ?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నెలకొంటున్న పరిణామాలు ఆ పార్టీ నేతలకే మింగుడుపడం లేదు.ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రోజు రోజుకి తెలంగాణాలో బలహీనం అవుతుండడంతో బలం పుంజుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు మొదలుపెట్టింది.

 I Will Relieve From Tpcc Chief Soon Says Uttam Kumar Reddy-TeluguStop.com

అయినా భవిష్యత్తుపై ఆ పార్టీ నేతల్లో నమ్మకం లేకపోవడంతో ఒక్కొక్కరూ పార్టీకి దూరం అవుతూ వస్తున్నారు.ఈ నేపథ్యంలో అధిష్టానం కూడా తెలంగాణాలో పార్టీని పరుగులు పెట్టించేందుకు పీసీసీ అధ్యక్షుడిని ఎంపిక చేసే పనిలో ఉంది.

ఇది ఇలా ఉండగానే ఈ రోజు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక నిర్ణయం ప్రకటించారు.

కొద్ది రోజుల్లో తాను పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయబోతున్నాను అంటూ ప్రకటించి సంచలనం సృష్టించారు.

హుజూర్‌నగర్ సమావేశంలో ఆయన తన నిర్ణయాన్ని స్పష్టం చేశారు.సొంత నియోజకవర్గానికి సమయం కేటాయించలేకపోతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఆయన చెబుతున్నా ఎలాగూ మరికొద్ది రోజుల్లో కొత్త పీసీసీ అధ్యక్షుడి ఎంపిక ఉండే అవకాశం ఉండడంతో ముందుగానే ఆయన రాజీనామా చేయాలని చూస్తున్నట్టు అర్ధం అవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube