నా కూతురికి నేను పెళ్లి చేయను... కూతురు పెళ్లి గురించి తేజ సంచలన వ్యాఖ్యలు!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో డైరెక్టర్ తేజ (Teja) ఒకరు.ప్రస్తుతం ఈయన అహింస సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నారు.

 I Will Not Do Marriage My Daughter Details, Teja, Daughter Marriage, Register Ma-TeluguStop.com

ఈ సినిమా జూన్ రెండవ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి తేజ తన కుమార్తె కుమారుడు గురించి పలు విషయాలను వెల్లడించారు.

తన కుమారుడు త్వరలోనే ఇండస్ట్రీలోకి రాబోతున్నారని ఈయన తెలిపారు.

Telugu Tejalatest, Teja, Tejas Latest, Tollywood-Movie

తన కుమారుడు చూడటానికి చాలా అందంగా ఉంటాడు హీరోగా కావాల్సిన శిక్షణ కూడా విదేశాలలో పూర్తిచేసుకుని వచ్చారని తేజ తెలియజేశారు.ఇక తన కుమార్తె (Teja Daughter) గురించి కూడా ఈయన ఈ సందర్భంగా మాట్లాడారు.తన కుమార్తె కూడా విదేశాలలో చదువు పూర్తి చేసుకుని ఇండియాకు తిరిగి వచ్చిందని తేజ తెలియజేశారు.

తన కూతురి వివాహం (Marriage) గురించి కూడా మాట్లాడుతూ తన కుమార్తెకు పెళ్లి చేయనని తెలిపారు.తన కూతురికి ఎవరైతే నచ్చుతారో ఏ వ్యక్తి అయితే తనకు సరైన వ్యక్తి అని భావిస్తుందో తనని రిజిస్టర్ మ్యారేజ్ (Register Marriage) చేసుకొని రమ్మని చెప్పానని ఈ సందర్భంగా ఈయన తెలియజేశారు.

Telugu Tejalatest, Teja, Tejas Latest, Tollywood-Movie

తన కుమార్తె తనకు నచ్చిన వాడిని వివాహం చేసుకొని వస్తే నేను తర్వాత అందరిని పిలిచి భోజనాలు పెడతానని ఇదే విషయమే తన కుమార్తెకు కూడా చెప్పానని తెలిపారు.పెళ్లి తర్వాత తన భర్త తనకు నచ్చకపోతే నిర్మొహమాటంగా విడాకులు ఇవ్వమని కూడా తనకు చెప్పానని తేజ షాకింగ్ కామెంట్స్ చేశారు.మన సంతోషం కోసం మన బ్రతకాలి కానీ సమాజం ఏమనుకుంటుందో అని ఆలోచించడం అనవసరం అనే విషయాన్ని తన కుమార్తెకు తెలియజేశానని ఈ సందర్భంగా తేజ తెలిపారు.ఏది ఏమైనా కూతురి పెళ్లి విషయంలో ఇలా విభిన్నంగా ఆలోచించే తండ్రి మరి ఎవరు ఉండరని తేజ వ్యాఖ్యలను బట్టి చూస్తే అర్థమవుతుంది.

ఇలా కూతురు పెళ్లి గురించి తేజ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube