శనివారం బంజారాహిల్స్ లోని రాడిసన్ బ్లూ హోటల్లోని పబ్ ఫై పోలీసులు దాడి చేసి సుమారు 150 మందీని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.ఇక పోలీసులు ఇలా ఉన్నఫలంగా దాడి చేయడంతో ఈ దాడిలో భాగంగా ప్రముఖ సినీ సెలబ్రిటీల పిల్లలు, రాజకీయ నాయకుల పిల్లలు కూడా అరెస్టయ్యారు.
ఈ క్రమంలోనే మెగా డాటర్ నిహారిక, ప్రముఖ సింగర్ రాహుల్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అదేవిధంగా ప్రముఖ రాజకీయ నాయకుడు గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్ హీరో సినిమా ద్వారా వెండితెర ఆరంగ్రేటం చేసిన సంగతి మనకు తెలిసిందే.
ఇక ఈ దాడిలో గల్లా అశోక్ కూడా అరెస్ట్ అయినట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.ఈ క్రమంలోనే ఈ ఘటనపై గల్లా అశోక్ స్పందిస్తూ సంతోషం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఓ మీడియాతో ముచ్చటించిన అశోక్ తన గురించి వస్తున్నటువంటి వార్తలను చూసి సంతోషం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…నేను ఆరోజు ఫిజియోథెరపీ చేయించుకుంటూ ఉన్నాను.సడన్ గా వార్తలలో ఒక్కసారిగా నా పేరు వచ్చింది.అలా నా పేరు ఎందుకు వినిపించిందో తెలియదు కానీ, వార్తలలో నా పేరు అలా మార్మోగి పోవడంతో అప్పుడు నిజమైన హీరో అనే భావన నాలో కలిగింది.
సెలబ్రిటీల లైఫ్ అంటే ఇలానే వస్తుంటాయనిపించింది.ఏది ఏమైనా ఈ పబ్ వ్యవహారం వల్ల ఒక్కసారిగా హీరోగా మారిపోయాను అంటూ గల్లా అశోక్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు.








