నందమూరి బాలకృష్ణ (Balakrishna) నటి సుహాసిని( Suhasini ) మధ్య ఎంతో మంచి అనుబంధం ఉంది.వీరిద్దరి కాంబినేషన్లో ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలు వచ్చాయి.
వీరిద్దరి కాంబినేషన్లో రాముడు భీముడు, మంగమ్మగారి మనవడు, బాలగోపాలుడు, ప్రెసిడెంట్ గారి అబ్బాయి వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి.
అంతేకాకుండా సుహాసిని బాలకృష్ణ (Suhasini, Balakrishna) నటించిన పాండురంగడు, లెజెండ్ వంటి సినిమాల్లో కీలకపాత్రలో నటించింది.
అయితే తాజాగా బాలకృష్ణ హోస్టుగా చేసే అన్ స్టాపబుల్ షో కి( Unstoppable With NBK Limited Edition ) గెస్ట్లుగా వచ్చారు సీనియర్ నటి సుహాసిని, శ్రియ, డైరెక్టర్ హరీష్ శంకర్, జయంత్ సి పరాంజీలు. వీరందరిలో ముందుగా సీనియర్ నటి సుహాసిని స్టేజ్ మీదకి రాగానే నాకు సుహాసిని కి మధ్య విడదీయరాని బంధం ఉంది అంటూ బాలకృష్ణ మాట్లాడడం అందరినీ ఆకట్టుకుంది.

మా ఇద్దరిదీ జన్మజన్మల బంధం అలాగే శ్రీయా (Shriya) తో నాకు మిలీనియం బంధం ఉంది అంటూ బాలకృష్ణ చెప్పుకొచ్చారు.ఇక సుహాసిని బాలకృష్ణ గురించి చెబుతూ బాలకృష్ణ అప్పట్లో చాలా సిగ్గు పడుతూ ఉండేవారు అని చెప్పగా శ్రియ గట్టిగా అరిచింది.వెంటనే హరీష్ శంకర్ మీరు చెప్పేది నేను అస్సలు నమ్మను అని చెప్పగా బాలకృష్ణ మాట్లాడుతూ.నేను మీ ముగ్గురితో మాత్రమే మాట్లాడతాను.హరీష్ శంకర్ ని( Harish Shankar ) పక్కన పెడతాను అని అన్నారు.

ఆయన మాటలకు అవాక్కైన జయంతి సి పరాంజి( Jayanth C Paranji ) ఎందుకు పాపం ఆయనతో ఎందుకు మాట్లాడరు అని అడగగా.నాకు హరీష్ శంకర్ (Harish Shankar) తో పాత గొడవలు ఉన్నాయిలే అని చెప్పారు.ఇక ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
ఇక సుహాసిని, శ్రియాల లతో బాలకృష్ణ బంధం గురించి తెలియాలంటే అలాగే హరీష్ శంకర్ కి,బాలకృష్ణ కి మధ్య ఉన్న పాత కక్ష్య ల గురించి పూర్తి విషయాలు తెలియాలంటే కచ్చితంగా ఎపిసోడ్ మొత్తం వచ్చేవరకు ఆగాల్సిందే.