మహేష్ బాబు సర్కారీ వారి పాట సినిమా ప్రీ రిలీజ్ వేడుకను శనివారం ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించారు.ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా సుకుమార్ ఈ వేదికపై మాట్లాడుతూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.ముఖ్యంగా మహేష్ బాబు గురించి సుకుమార్ ఎన్నో విషయాలను మాట్లాడారు.
డైరెక్టర్ సుకుమార్ చేతుల మీదుగా మ.మ.మహేశా సాంగ్ రిలీజ్ చేశారు.
ఈ పాట విడుదల అనంతరం సుకుమార్ మాట్లాడుతూ ఇప్పటివరకు మహేష్ బాబుని ఇంత జోష్ ఫుల్ గా తానెప్పుడూ చూడలేదని, మీ అందరితోపాటు సర్కారీ వారి పాట సినిమా చూడటానికి తాను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని సుకుమార్ వెల్లడించారు.
ఇకపోతే మహేష్ బాబు సెట్ లో ఎలా ఉంటాడు అనే విషయాన్ని గురించి కూడా సుకుమార్ వెల్లడించారు.సెట్ లోమహేష్ ఉంటే డైరెక్టర్ కింగులా ఉంటారు అందుకే సెట్లో ఆయనకు డైరెక్టర్స్ అందరు కూడా రెస్పెక్ట్ ఇస్తారని సుకుమార్ వెల్లడించారు.

ఈ క్రమంలోనే సుకుమార్ మహేష్ బాబు కాంబినేషన్లో వచ్చిన నేనొక్కడినే సినిమా గురించి ప్రస్తావిస్తూ ఆ రోజులు ఎప్పటికీ మర్చిపోలేనని, ఆ సినిమాను మీరు ఎంతగా ఆదరించారో ఇప్పుడు కూడా ఆదరిస్తున్నారని సుకుమార్ నేనొక్కడే రోజులను గుర్తు చేసుకున్నారు.ఇక సర్కారీ వారి పాట సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తుందని, చిత్ర బృందానికి సుకుమార్ ఆల్ ద బెస్ట్ తెలియజేశారు.సుకుమార్ మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన నేనొక్కడినే సినిమా ప్రేక్షకులను సందడి చేయ లేక పోయినప్పటికీ మహేష్ బాబు కెరీర్లో కల్ట్ క్లాసిక్ గా నిలబడిందని చెప్పవచ్చు.







