తెలంగాణలో కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ నిర్వహించిన బహిరంగ సభ సక్సెస్ కావడంతో అటు కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో పాటు, తెలంగాణ కాంగ్రెస్ నాయకులలోను ఉత్సాహం పెరిగింది.రాహుల్ సభ సక్సెస్ అవుతుందని ముందుగా ఎవరు ఊహించలేదు.
ఈ సభకు భారీగా జనసమీకరణ చేపట్టడంలో కాంగ్రెస్ సీనియర్ నేతలతో పాటు, రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారు.కాంగ్రెస్ ను ఏవిధంగా అధికారంలోకి తీసుకురావాలనే విషయంపైనే రాహుల్ నాయకులతో చర్చించారు.
అలాగే కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వస్తే ఏం చేస్తుంది అనే విషయాలపైన క్లారిటీ ఇచ్చారు.ఇది ఇలా ఉంటే వరంగల్ సభ పైన , రాహుల్ పైన టిఆర్ఎస్ నేతలు టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేస్తూనే ఉన్నారు.
వారితో పాటు సినీ నటుడు ప్రకాష్ రాజ్ సైతం ఇప్పుడు కాంగ్రెస్ ను, రాహుల్ ను విమర్శిస్తూ చేసిన ట్వీట్ కాంగ్రెస్ నేతలకు ఆగ్రహం కలిగించింది.ఈ మేరకు ప్రకాష్ రాజ్ పై వారంతా తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు.” తెలంగాణను దార్శనికుడైన కెసిఆర్ పరిపాలిస్తున్నాడు అని, మీ మూర్ఖుల గుంపుతో ఏమి ఆఫర్ చేస్తారో చెప్పాలని ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు.దీనిపైనే తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతున్నారు.
ప్రకాష్ రాజ్ కు సినిమాలు లేవని, గ్లామర్ తగ్గిపోయిందని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గా రెడ్డి విమర్శించారు.

ప్రకాష్ రాజ్ రాజ్యసభ సభ్యత్వం కోసం కెసిఆర్ ను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని జగ్గారెడ్డి విమర్శించారు.ఒక్కరోజు కూడా ప్రకాష్ రాజ్ ప్రజల్లోకి రాలేదని, అసలు కెసిఆర్ గురించి ప్రకాష్ రాజ్ కు ఏం తెలుసునని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కెసిఆర్ ను ప్రకాష్ రాజ్ తిట్టే రోజు కూడా త్వరలోనే ఉందని జగ్గారెడ్డి అన్నారు.
ప్రకాష్ రాజ్ ఓ బాగూన్, అంత మొనగాడు అయితే మా ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయాడని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు.కెసిఆర్ రాజ్యసభ సీటు ఇస్తారనే ఆశతో నోటికొచ్చినట్టు ప్రకాష్ రాజ్ మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.







