ఆ స్టార్ హీరోలు సైతం నిహారికకు అన్నయ్యలు అవుతారా.. ఈ షాకింగ్ విషయాలు తెలుసా?

టాలీవుడ్ నటి,యాంకర్ మెగా డాటర్ కొణిదెల నిహారిక ( Mega daughter Konidela Niharika )గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

మొదట యాంకర్ గారి తన కెరీర్ ను మొదలుపెట్టిన ఈమె తన యాంకరింగ్ తో ప్రతి ఒక్కరిని అలరించింది.

ఆ తర్వాత కొన్ని తెలుగు సినిమాలలో నటించింది.ఆపై ఇంట్లో వాళ్ళను ఎదిరించి మరి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి పలు సినిమాలలో నటించినప్పటికీ ఆమెకు ఆశించిన స్థాయిలో గుర్తింపు దక్కలేదు.

ఇక ఆ తర్వాత ఈమె జొన్నలగడ్డ చైతన్యను( Jonnalagadda Chaitanya ) పెళ్లి చేసుకుని ఊహించని విధంగా పెళ్లైన కొంతకాలానికే విడాకులు తీసుకొని విడిపోయిన విషయం తెలిసిందే.

తన భర్తకు విడాకులు ఇచ్చి ప్రస్తుతం తన తల్లిదండ్రుల వద్ద ఉంటోంది నిహారిక.ప్రస్తుతం నిర్మాతగా రాణిస్తూ వెబ్ సిరీస్ ( Web series )లను నిర్మిస్తోంది.అప్పుడప్పుడు సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించడంతో పాటు ఇంటర్వ్యూలలో పాల్గొని తనకు సంబంధించిన విషయాలను పంచుకుంటూ ఉంటుంది నిహారిక.

Advertisement

ఈ నేపథ్యంలోనే తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.ఇండస్ట్రీలో ఎవరితో పడితే ఆ హీరోతో నటించలేను.

ఈమధ్య కాలంలో మంచి స్క్రిప్టులు రాలేదు.మరీ రొటీన్ కథలొచ్చాయి.

మరో ముఖ్యమైన కారణం ఏంటంటే, ఇండస్ట్రీలో ఉన్న 11 మంది హీరోలు నాకు అన్నయ్యలు అయిపోయారు.

అదో సమస్య నాకు.నేను యూనివర్సల్ సిస్టర్ అయిపోయాను.నితిన్ ( Nitin )నాకు అన్నయ్య.

ఆ దేశంలో మహేష్ రాజమౌళి కాంబో మూవీ షూటింగ్.. హీరోయిన్ ను మార్చాలంటూ?
రాష్ట్రపతి ముర్ము విందుకు వచ్చిన ఇండోనేషియన్లు ఏం చేశారో చూడండి.. వీడియో వైరల్..

శర్వానంద్ ( Sharwanand )కూడా నాకు అన్నయ్యే.ఇలాంటి అన్నలు సినిమా ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు అని తెలిపింది నిహారిక.

Advertisement

అలాగే తనకు సౌకర్యవంతంగా ఉన్నంతవరకు గ్లామర్ గా కనిపించడానికి ఓకే అని తెలిపింది.అయితే కరోనా మహమ్మారి తర్వాత హీరోయిన్ గా ఏ సినిమా చేయని నిహారిక చాలా గ్యాప్ తర్వాత రీసెంట్గా మరో తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

అయితే అక్టోబర్ నుంచి ఆ సినిమా సెట్స్ పైకి వస్తుందని, తమిళ్ లో ఆల్రెడీ ఒక సినిమాను పూర్తి చేసినట్లు ఆమె తెలిపింది.మొత్తానికి సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా అలాగే నిర్మాతగా ఫుల్ బిజీ బిజీ అవ్వడానికి ప్రయత్నిస్తోంది నిహారిక.

తాజా వార్తలు