బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్( Vidya Balan ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె హిందీ తో పాటు బెంగాలీ మలయాళం భాషల్లో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఒకవైపు సినిమాలలో నటిస్తూనే తరచూ ఏదోక విషయంతో వార్తలు నిలుస్తూ ఉంటుంది విద్యాబాలన్. ఇది ఇలా ఉంటే ఈమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
ఈ నేపథ్యంలోనే ఒక స్టార్ హీరోపై ఆసక్తికర కామెంట్స్ చేసింది.ఈ అమ్మడు, స్టార్ హీరో మోహన్ లాల్‌తో( Mohan Lal ) చక్రం( Chakram Movie ) అనే సినిమాలో నటించింది.
ఈ నేపథ్యంలో జరిగిన సంఘటనలు గుర్తు చేసుకుని విద్యాబాలన్ ఆయన గురించి పలు విషయాలు తెలిపి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.
ఈ సందర్భంగా విద్యాబాలన్ మాట్లాడుతూ.ఆయన గొప్ప నటుడు మాత్రమే కాదు మంచి వ్యక్తి.చక్రం సినిమా షూటింగ్‌లో సమయంలో ఆయన సెట్‌లో చేసిన పనులను చూసిన నేను చాలా ఆశ్చర్యపోయాను.
షూటింగ్ గ్యాప్ దొరికినప్పుడు ఆయన పని గురించే ఆలోచిస్తారు.పుస్తకాలు చదవడం, ఇతరులతో మాట్లాడటం వంటివి చేస్తే పనిపై ఇంట్రెస్ట్ పోతుందని అనుకునేవారు.
దీంతో దర్శకుడు షాట్‌కు ఎప్పుడు పిలిచినా వెళ్లడానికి సిద్ధంగా ఉండేవారు.ఆయనకు సినిమాపై ఉన్న అంకితభావం చూసిన నేను స్ఫూర్తి పొందాను.
మూవీపై బాగా రావాలని ఆయన పడే తపన నన్ను నిజంగా ప్రేరేపించింది.
అంతేకాదు అంత పెద్ద స్టార్ అయినప్పటికీ సెట్‌లో చిన్న చిన్న పనులు చేయడానికి కూడా వెనకాడరు.కెమెరా ఫోకస్ ఎంత దూరం వస్తుందో అని కొలిచేందుకు టేప్ పట్టుకోవడంలోనూ సిబ్బందికి సాయం చేస్తారు.ఆ షూటింగ్ ఆయన్ని చూసి విలువైన పాఠాలు నేర్చుకున్నా వ్యక్తిగతంగా ఎదగడం కంటే టీమ్‌గా ముందుకు సాగడం మరింత ముఖ్యమైన అర్థమైంది అని ఆయన గురించి చెబుతూనే ప్రశంసల వర్షం కురిపించింది విద్యాబాలన్.