ఆయన చొరవతోనే సొంత ఇల్లు కొన్నాను... రచ్చ రవి కామెంట్స్ వైరల్!

I Bought My Own House On His Initiative Racha Ravis Comments Are Viral , Rachha Ravi, Jabardasth, Brahmananda, Comments Are Viral

జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో రచ్చ రవి (Raccha Ravi) ఒకరు.జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ గా కొనసాగిన ఈయన తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో కేవలం అతి తక్కువ సమయంలోనే టీం లీడర్ గా మారిపోయారు.

 I Bought My Own House On His Initiative Racha Ravis Comments Are Viral , Rachha-TeluguStop.com

ఇలా టీం లీడర్ గా కొనసాగుతున్నటువంటి రచ్చ రవి కొన్ని కారణాలవల్ల జబర్దస్త్(Jabardasth) నుంచి బయటకు రావడంతో అందరూ ఈయనకు కూడా మల్లెమాల వారితో మనస్పర్ధలు రావడం వల్ల బయటికి వచ్చారని భావించారు.ఇలా జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన ఈయన పలు సినిమాలలో నటిస్తూ సందడి చేస్తున్నారు.

ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి రచ్చ రవి జబర్దస్త్ నుంచి తాను బయటకు రావడానికి గల కారణాలను తెలియజేశారు.అందరూ అనుకున్నట్టు తనకు మల్లెమాల ( Mallemala )వారితో ఏ విధమైనటువంటి మనస్పర్ధలు లేవని జబర్దస్త్ కార్యక్రమం తనకు ఒక తల్లి లాంటిది అని తెలిపారు.జబర్దస్త్ లో ఉండగా తనకు సినిమా అవకాశాలు రావడంతో రెండింటిని మేనేజ్ చేయలేక జబర్దస్త్ కార్యక్రమానికి దూరమయ్యానని ఈయన తెలిపారు.

ఇక జబర్దస్త్ కార్యక్రమంలో తను వేసే స్కిట్లు చూసినటువంటి హాస్యబ్రహ్మ బ్రహ్మానందం గారు తనను పిలిచి మరీ తన కామెడీను మెచ్చుకున్నారు అని టీవీలలో ఇలా ఒకసారి బ్రహ్మానందం( Brahmanandam ) గారితో మాట్లాడుతూ మాటల మధ్యలో తనకు ఇల్లు కొనుక్కోవడమే కల అంటూ చెప్పాను.అయితే నేను చెప్పిన ఈ మాటలు విన్న బ్రహ్మానందం గారు ఒక ఫ్లాట్ ఉంది.ఐదు లక్షల తక్కువైనా పర్వాలేదు వెళ్లికొనుక్కో డబ్బు నేను ఇస్తానని బ్రహ్మానందం గారు చెప్పారు.

తనకు ఎవరి దగ్గర డబ్బు తీసుకోవడం ఇష్టం లేకపోయినా బ్రహ్మానందం గారు చెప్పడంతో వెళ్లి ఫ్లాట్ కొన్నానని,ఇలా తాను ఇల్లు కొనడానికి బ్రహ్మానందం గారు చాలా సహాయం చేశారని రచ్చ రవి తెలిపారు.ఇక తన గృహప్రవేశానికి కూడా బ్రహ్మానందం గారు వచ్చి తమను ఆశీర్వదించారని ఈయన తెలిపారు.

Video : Rachha Ravi,Jabardasth,Brahmananda,comments Are Viral #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube