నేను ఎప్పుడు తప్పులు చేస్తూనే ఉంటాను.. ఆ వీడియో షేర్ చేసిన ప్రణిత!

తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన కన్నడ బ్యూటీ ప్రణీత సుభాష్ గురించి అందరికీ పరిచయమే.తన అందంతో, నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది.

 Actress Pranitha Subash Insta Reel On Make Mistakes, Pranitha Subash,make Mistak-TeluguStop.com

ఏం పిల్లో.ఏం పిల్లడో అనే సినిమాతో తొలిసారిగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైంది.

ఆ తర్వాత పలు సినిమాలలో నటించగా.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమాలో నటించి తన పాత్రకు మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఇక ఆ తర్వాత బ్రహ్మోత్సవం, రభస వంటి పలు సినిమాలలో నటించింది.కానీ ఎందుకో టాలీవుడ్ ఇండస్ట్రీలో అంతగా మెప్పించలేకపోయింది.

ఈమె టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా నటించింది.

అంతేకాకుండా కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా నటించి తనేంటో నిరూపించుకుంది.

ఇక ఈ ముద్దుగుమ్మ గతంలో కోవిడ్ సమయంలో కూడా ఎంతో మంది ప్రజలకు సహాయం చేయడానికి ముందుకు వచ్చింది.ప్రణీత ఫౌండేషన్ పేరు మీద ఇప్పటికీ చాలా మందికి సహాయం చేస్తూనే ఉంది.

ఇక ఈమె బాలీవుడ్ లో మంచి సక్సెస్ లో ఉన్న సమయంలో బెంగళూరుకు చెందిన నితిన్ రాజ్ అనే ఓ బడా బిజినెస్ మాన్ ను అతికొద్ది మంది కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకుంది.ఇటీవలే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.

ఇక ప్రణీత సోషల్ మీడియాలో బాగానే యాక్టివ్ గా ఉంటుంది.

అప్పుడప్పుడూ తన వ్యక్తిగత విషయాలను, తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలను పంచుకుంటుంది.ఈమెకు సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది.ఇక తనకు సంబంధించిన ఫోటోలను కూడా బాగా షేర్ చేసుకుంటుంది.

ఈమధ్య తన కూతురు ఫోటోలను కూడా పంచుకుంటుంది.తన ఫాలోవర్స్ తో కూడా బాగా ముచ్చట్లు పెడుతుంది.

ఇదంతా పక్కన పెడితే తాజాగా తన ఇన్ స్టాలో ఒక పోస్ట్ షేర్ చేసుకుంది.అందులో సరదాగా ఒక ఆట ఆడింది.

అందులో ఈరోజు నువ్వు ఎలా ఉంటావో.ఎప్పుడు తప్పులు చేస్తూనే ఉంటావు అన్నట్లు వచ్చింది.

ఇక దానికి సంబంధించిన వీడియోను షేర్ చేసుకోగా ప్రస్తుతం ఆ వీడియో బాగా వైరల్ అవుతుంది.

ఇక ఆ వీడియో చూసిన తన అభిమానులు నువ్వు ఎప్పుడు తప్పులు చేయవు అంటూ నువ్వు ఎప్పుడు మంచి పనులు చేస్తుంటావు కాబట్టి నువ్వు ఇలా ఉన్నావు అని అంటున్నారు.ఇక మరికొందరు ఇతరులకు సహాయం చేసే గుణం నీలో ఉంది అంతేకానీ నువ్వు తప్పులు చేయలేవు అని అంటున్నారు.ఇక ప్రణీత ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ మొత్తం ఫ్యామిలీతో బాగా బిజీగా ఉందని తెలుస్తుంది.

ఇక తనకు కూతురు కూడా పుట్టడంతో ఈ సమయంలో తన కూతురికి, తన ఫ్యామిలీకి బాగా దగ్గరగా తాను ఉండాలనుకుంటుంది.మరి ఈ ముద్దుగుమ్మ తన అభిమానుల కోసం మళ్లీ సినిమాల్లో అడుగుపెడుతుందో లేదో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube