కోల్పోయిన యవ్వనాన్ని తిరిగి పొందాలా? ఆక్సిజన్‌ గది ఉందిగా?

పోయిన యవ్వనాన్ని ( Youngness ) తిరిగి పొందొచ్చునంటే ఆక్సిజన్‌ గది ఏం ఖర్మ, విషయాన్నైనా తాగేస్తాం అని అంటారా.అవును, నేటితరం ఆహారం తరువాత అందం కోసమే ఎక్కువగా ఖర్చు చేస్తున్నట్టు సర్వేలు చెబుతున్నాయి.

 Hyperbaric Oxygen Therapy For Looking Young Details, Youthfulness, New Medical T-TeluguStop.com

అయితే కోల్పోయిన యవ్వనాన్ని తిరిగి పొందటానికి అమృతమో, లేదంటే విషమో తాగాల్సిన పనిలేదు.ఓ గదిలో రోజుకు మీరు ఓ గంట పడుకుంటే చాలు.

అవును, అయితే దీని కాస్ట్ అందరూ భరించలేరు.

ఇది కేవలం సంపన్నులకు మాత్రమే అందుబాటులో ఉండే ‘హెచ్‌బీఓటీ (హైపర్‌బ్యారిక్‌ ఆక్సిజన్‌ థెరపీ)’( Hyperbaric Oxygen Therapy ) అన్నమాట.కాగా రాబోయే రోజుల్లో తక్కువ ధరల్లో దొరకనుందని వినికిడి.దీనికోసం అమెరికాకు చెందిన హెచ్‌ఓబీఓ2 అనే సంస్థ ప్రత్యేకమైన ఓ మెటల్‌ చాంబర్‌ను( Metal Chamber ) రూపొందించింది.

సాధారణంగా మన వాతావరణంలో 21 శాతం ఆక్సిజన్, 79 శాతం నైట్రోజన్, ఇతర వాయువులు ఉంటాయనే విషయాన్ని మీరు చిన్నపుడు చదువుకొనే వుంటారు.

ఐతే ఇపుడు O2 చాంబర్‌లో 95 శాతం స్వచ్ఛమైన ఆక్సిజన్‌ అందుతుందని చెబుతున్నారు.ఇందులోని ప్రత్యేకమైన కొల్లాజెన్‌ ఫైబర్స్… లైటింగ్‌ సిస్టమ్‌ ముడతలను తొలగించి, చర్మాన్ని కాంతిమంతగానూ, మృదువుగా చేస్తుంది.వినడానికి ఆశ్చర్యంగా వున్నా ఇది నిజమే.

ప్రపంచ పాప్ రారాజు మైఖేల్ జాక్సన్ ఇలాంటి ఓ ఛాంబర్లో రోజూ నిద్రించేవాడని సమాచారం.ఇక ఇది కావాల్సిన వారు వీరి అధికారిక వెబ్‌సైట్‌ నుంచి కొనుగోలు చేయవచ్చు.

అద్దెకు కూడా తీసుకోవచ్చండోయ్.అయితే నెలకు రూ.80 వేల నుంచి, రూ.లక్ష తీసుకుంటారు.అయితే, ఇది ప్రస్తుతం విదేశాల్లో మాత్రమే అందుబాటులో ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube