హైపర్ ఆది( Hyper Aadi ) టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు ఈయన జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ గా తన కెరియర్ ప్రారంభించి తనలో ఉన్నటువంటి టాలెంట్ మొత్తం బయట పెడుతూ అతి తక్కువ సమయంలోనే టీం లీడర్ గా మారిపోయారు.ఇలా జబర్దస్త్ ( Jabardasth ) కార్యక్రమం ద్వారా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి హైపర్ ఆది అనంతరం శ్రీదేవి డ్రామా కంపెనీ ఢీ వంటి కార్యక్రమాలలో కూడా సందడి చేస్తున్నారు.
ప్రస్తుతం జబర్దస్త్ కార్యక్రమానికి దూరమైన ఇతర బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తూనే మరోవైపు సినిమా అవకాశాలు కూడా అందుకున్నారు.

ఈయన సినిమాలలో కూడా కమెడియన్ గా( Comedian ) నటిస్తూ ప్రేక్షకులను మెప్పించారు.సుమారు 20 సినిమాలకు పైగా నటించినటువంటి ఆది కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.ఇక ఆది అమ్మాయిల పట్ల వేసే సెటైర్స్ డబల్ మీనింగ్ డైలాగులు అందరికీ నవ్వు తెప్పిస్తూ ఉంటాయి.
ఇలా అమ్మాయిల పట్ల ఇలాంటి కామెంట్స్ చేసే హైపర్ ఆది నిజ జీవితంలో కూడా ఒంగోలు( Ongole )లో ఓ అమ్మాయి పట్ల ఇలాంటి కామెంట్స్ చేశారని దీంతో ఒంగోలు వాసులు తనని చితక్కొట్టారంటూ గతంలో పెద్ద ఎత్తున వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

తాజాగా ఈ వార్తలపై హైపర్ ఆది స్పందించి క్లారిటీ ఇచ్చారు.జోర్దార్ సుజాత( Jordar Sujatha ) హోస్ట్ గా డయల్ న్యూస్ ఛానల్ లో జోర్దార్ పార్టీ విత్ సుజాత( Jordar Party With Sujatha ) పేరుతో టాక్ షో ప్రసారం అవుతుంది.ఈ షోకి హైపర్ ఆది గెస్ట్ గా వచ్చాడు.
ఈ కార్యక్రమంలో భాగంగా సుజాత మాట్లాడుతూ ఓ అమ్మాయిని అల్లరి చేసినందుకు నిన్ను ఒంగోలులో కొట్టారంట కదా… అని అడిగింది. దీంతో హైపర్ ఆది సమాధానం చెబుతూ నేను స్కిట్లలో అమ్మాయిల పట్ల కామెంట్స్ చేసినంత మాత్రాన బయట అమ్మాయిలతో మాట్లాడుతాను అనుకుంటే పొరపాటు నేను బయట అమ్మాయిలతో అసలు మాట్లాడనని ఆది తెలిపారు.
ఇలా నా గురించి వచ్చిన ఈ వార్తలలో ఏమాత్రం నిజం లేదని ఆది క్లారిటీ ఇచ్చారు.







