తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు డీ షో గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఈ షో ప్రేక్షకులకు ఒకవైపు డాన్స్, మరొకవైపు ఎంటర్టైన్మెంట్ ను అందిస్తూ దూసుకుపోతోంది.
ఇప్పటికే ఈ షో 13 సీజన్ లను విజయవంతంగా పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే.ఇక ప్రస్తుతం 14 వ సీజన్ ప్రసారం అవుతోంది.
ఇకపోతే ఈ షోకీ జడ్జీలుగా నందిత శ్వేత, ప్రియమణి వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.ఇక జెడ్జ్ లతో పాటు కంటెస్టెంట్స్, టీమ్ లీడర్స్ రచ్చ మాములుగా లేదు.
మరీ ముఖ్యంగా హైపర్ ఆది అందరిపై పంచులు వేస్తూ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తున్నాడు.షోలో జెడ్జ్ ను మొదలుకొని యాంకర్ వరకు ప్రతి ఒక్కరి పై పంచులు వేస్తూ నాన్ స్టాప్ గా నవ్విస్తూనే ఉన్నాడు.
ఇదీ ఇలా ఉంటే తాజాగా షోలో ఒక టాస్క్ లో భాగంగా నవ్య స్వామిని రోబోలా మారమని చెప్పగానే దానికి హైపర్ ఆది ఆమెపై అదిరిపోయే పంచ్ వేసాడు.ఆమె రోబోలా చేస్తున్న నేపథ్యంలో 80 ఏళ్ల లో వాకింగ్ కు వచ్చినట్లు ఉంది అంటూ నవ్య స్వామి పై పంచ్ వేశాడు.
ఈ క్రమంలోనే టాస్క్ లో భాగంగా నవ్య స్వామి తన పెర్ఫార్మెన్స్ తో కేక పెట్టిస్తోంది.ఇక ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇకపోతే వెండితెర తో పాటు బుల్లితెరపై కూడా నటీనటుల ప్రేమాయణాలు ఒక రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.ఇక బుల్లితెర నటీనటులు జోడిలలో రవి కృష్ణ, నవ్య స్వామి జోడి కూడా ఒకటి.

ఇకపోతే ఢీ షోనుంచి జెడ్జ్ శేఖర్ మాస్టర్ వెళ్లిపోయిన తర్వాత చాలామంది ఈ షోని చూడటమే ఆపేశారు.ఆ తర్వాత రష్మీ, సుడిగాలి సుదీర్ కూడా వెళ్లిపోవడంతో దాదాపుగా 85 శాతం మంది ప్రేక్షకులు ఈ షోని చూడటం ఆపేశారు.అంతేకాకుండా ఈ షోకీ సంబంధించిన ఎపిసోడ్ ల కింద సుధీర్ అన్న రావాలి అంటూ కామెంట్స్ చేస్తూ ఉన్నారు.ప్రస్తుతం ఈటీవీలో ప్రసారమవుతున్న ఢీ 14 షోకి టిఆర్పి రేటింగ్ కూడా భారీగా తగ్గింది అని తెలుస్తోంది.
మరి నెక్స్ట్ సీజన్ లో అయినా సుధీర్,రష్మీ లను తీసుకు వస్తారో లేదో చూడాలి మరి
.






