ఆ కారణాల వల్లే పవన్ కళ్యాణ్ కు అభిమానిగా మారాను.. హైపర్ ఆది కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ కమెడియన్లలో ఒకరైన ఒకరైన హైపర్ ఆది( Hyper Adi ) ప్రస్తుతం జనసేన పార్టీ కోసం పని చేస్తున్న సంగతి తెలిసిందే.హైపర్ ఆది పవన్ కళ్యాణ్ కు ( Pawan Kalyan ) వీరాభిమాని కాగా హైపర్ ఆది తాను పవన్ కు ఎందుకు వీరాభిమానిగా మారాడో వెల్లడించారు.

 Hyper Adi Comments About Pawan Klayan Details, Pawan Kalyan, Hyper Adi, Janasena-TeluguStop.com

హైపర్ ఆది చెప్పిన ఆ విషయాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నారని హైపర్ ఆది చెప్పుకొచ్చారు.

పవన్ కళ్యాణ్ వెంట మేము కూడా ఉంటామని ఆయన కామెంట్లు చేశారు.విశాఖలో బోట్లు తగలబడిన సమయంలో పవన్ కళ్యాణ్ మత్స్యకారులను( Fishermen ) ఆదుకున్నారని హైపర్ ఆది వెల్లడించారు.

కౌలు రైతులను ఆదుకునే విషయంలో పవన్ కళ్యాణ్ చూపించిన చొరవ నాకు బాగా నచ్చిందని హైపర్ ఆది పేర్కొన్నారు.

Telugu Hyper Adi, Hyperadi, Janasena, Pawan Kalyan-Movie

అనకాపల్లి జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణ( Konathala Ramakrishna ) అని ఆయన నీతి, నిజాయితీ ఉన్న వ్యక్తి కావడంతో పవన్ కళ్యాణ్ ఆయనకు సీటు ఇవ్వడం జరిగిందని హైపర్ ఆది వెల్లడించారు.అనకాపల్లిలో గడిచిన రెండు రోజుల ప్రచారంలో జనసేనకు( Janasena ) ఊహించని స్థాయిలో స్పందన వచ్చిందని హైపర్ ఆది పేర్కొన్నారు.కొణతాల రామకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన వెల్లడించారు.

Telugu Hyper Adi, Hyperadi, Janasena, Pawan Kalyan-Movie

హైపర్ ఆది ప్రచారం జనసేన పార్టీకి కలిసొస్తుందో లేదో చూడాల్సి ఉంది.జనసేన పార్టీ 21 స్థానాలలో పోటీ చేస్తుండగా 14 నుంచి 15 స్థానాలలో విజయం దక్కుతుందని జనసేన నేతలు భావిస్తున్నారు.జనసేన రాజకీయాలలో ఏ స్థాయిలో సంచలనాలు సృష్టిస్తుందో చూడాల్సి ఉంది.పిఠాపురంలో( Pithapuram ) పవన్ కళ్యాణ్ బంపర్ మెజార్టీతో గెలుస్తారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

హైపర్ ఆది కమెడియన్ గా తన రేంజ్ ను అంతకంతకూ పెంచుకుంటున్నారు.ఎన్నికలు పూర్తైన తర్వాత మాత్రమే టీవీ షోలతో బిజీ అవుతానని ఆది చెబుతుండటం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube