హైదరాబాద్ వనస్థలిపురం చోరీ కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది.రాబరీ వ్యవహారంపై పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.
ఇందులో భాగంగా హవాలా లింక్స్ బయటకు వచ్చాయి.వెంకట్రామిరెడ్డి వాట్సాప్ చాటింగ్ ఆధారంగా హవాలా లింక్స్ ను పోలీసులు గుర్తించారు.
అదేవిధంగా పాతబస్తీలోని ఫరూఖ్ తో ఎక్కువగా కాంటాక్ట్ లో ఉన్నట్లు నిర్ధారించారు.ఈ క్రమంలో వెంకట్రామిరెడ్డి నివాసంలో సోదాలు నిర్వహించిన పోలీసులు సుమారు రూ.2.75 కోట్లు స్వాధీనం చేసుకున్నారు.దాంతో పాటు నగదు లావాదేవీలకు సంబంధించిన పలు డైరీలను సీజ్ చేశారు.హవాలా లింక్స్ పై ప్రత్యేక బృందాలతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.







