సమాజంలో ఆడవాళ్ళకి రక్షణ అనేది లేకుండా పోతోంది.ప్రేమ, పెళ్లి విషయాలలో మగవారికి ఎంత స్వాతంత్రం ఉంటుందో ఆడవాళ్ళకి కూడా అంతే స్వాతంత్రం ఉంటుంది.
ప్రేమించడం, ప్రేమించానని చెప్పడం లో తప్పులేదు కానీ అవతలి వ్యక్తులకు నచ్చకపోతే బలవంతం చేయడం తప్పు.ఇలాంటి కోవకు చెందిన ఓ సంఘటన హైదరాబాద్ ఉప్పల్లో చోటు చేసుకుంది.
అప్పటికే వివాహితుడైన వ్యక్తి వరుసకు మరదలు అయ్యే యువతిని ప్రేమించానంటూ పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసి, ఆ యువతి అంగీకరించకపోవడంతో ఏకంగా ఆమె గొంతు కోసి హత్యా ప్రయత్నం చేశాడు.అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.

వివరాల్లోకెళితే.హైదరాబాద్ ( Hyderabad )ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.హైదరాబాదులోని హబ్సిగూడ ప్రాంతంలో నివాసం ఉంటున్న లక్ష్మీనారాయణ (31) షార్ట్ ఫిలింలు తీయడం, వీడియోలు ఎడిటింగ్ చేయడం చేస్తుంటాడు.లక్ష్మీనారాయణ స్వస్థలం ఖమ్మం జిల్లా.ఇతనికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.అయితే రామంతపూర్ లో నివాసం ఉండే బంధువుల అమ్మాయి (22) కు లక్ష్మీనారాయణ వరుసకు మేన బావ అవుతాడు.
ఆ అమ్మాయితో కలిసి లక్ష్మీనారాయణ సోషల్ మీడియా( Social media )లో రీల్స్ కూడా చేశాడు.దీంతో ఇద్దరికీ కాస్త పరిచయం పెరగడంతో తనను పెళ్లి చేసుకోవాలని లక్ష్మీనారాయణ ఆ అమ్మాయి ముందు ప్రపోజల్స్ పెట్టాడు.
కానీ ఆ యువతి నిరాకరించింది.ఈమధ్య ఆ యువతికి సినిమా ఫీల్డ్ లో అవకాశం రావడంతో ఇక లక్ష్మీనారాయణ ను పెద్దగా పట్టించుకోవడం మానేసింది.

ఈనెల 22న లక్ష్మీనారాయణ( Lakshminarayana ) ఆ యువతిని తన కారులో ఎక్కించుకొని ఉప్పల్ భగాయత్ కు తీసుకువెళ్లాడు.మళ్లీ ఆ యువతీతో పెళ్లి ప్రస్తావన తీసుకురావడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగింది.లక్ష్మీనారాయణ పథకం ప్రకారం తనతో పాటు తెచ్చుకున్న కత్తితో కారులోనే యువతి గొంతు పై దాడి చేసి గాయపరిచాడు.ఆ యువతి ఏదోలాగా లక్ష్మీనారాయణ నుండి తప్పించుకుని బయటకు వచ్చి మెడకు చున్ని కట్టుకొని తమ కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది.
కుటుంబ సభ్యులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని యువతిని ఆసుపత్రికి తరలించారు.కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు లక్ష్మీనారాయణ ను సోమవారం అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.







