పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan kalyan ) టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ మూవీ ”ఓజి”.ఈ సినిమా గురించి నిత్యం ఏదొక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది.
దీంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమా మీదనే ఎక్కువ ద్రుష్టి పెట్టారు.అందులోను పవన్ ఎంతో ఇంట్రెస్ట్ తో చేస్తుండడంతో ఈ సినిమా రిలీజ్ కోసం ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా 50 శాతం షూట్ పూర్తి చేసుకున్నట్టు మేకర్స్ ఇటీవలే అఫిషియల్ గా ప్రకటించారు.పవన్ వారాహి యాత్ర( Varahi yatra ) అంటూ రాజకీయాల్లో బిజీగా ఉండడంతో ఈయన లేని పోర్షన్ ను పూర్తి చేస్తున్నారు.ఈ క్రమంలోనే ఈ సినిమా రిలీజ్ పై మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది.ఇక ఈ సినిమా అనుకున్న సమయానికి పూర్తి అవుతుంది.

దీంతో ఈ సినిమాను ఈ ఇయర్ ఎండింగ్ కే రిలీజ్ చేయాలని మేకర్స్ అనుకుంటున్నట్టు టాక్.ఏది ఏమైనా ఈ సినిమాను డిసెంబర్ లో క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేయాలని భావిస్తున్నారు.మరి ఇది ఒకవేళ కుదరని పరిస్థితుల్లో 2024 సమ్మర్ కానుకగా రిలీజ్ చేయాలని భావిస్తున్నట్టు ఇప్పుడు కొత్త టాక్ నెట్టింట వైరల్ అయ్యింది.మరి ఈ రెండు సీజన్స్ లో ఏది కన్ఫర్మ్ అవుతుందో వేచి చూడాలి.
ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడీగా ప్రియాంక మోహన్( Priyanka Mohan ) హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా.
డివివి దానయ్య డివివి ఎంటర్టైన్మెంట్స్ పై భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.మరి సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ మాస్ యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేస్తుందో వేచి చూడాల్సిందే.







