హైదరాబాద్ టు షిరిడీ.. రూ.4000 లోపే మూడు రోజుల టూర్.. వివరాలు ఇవే..

మీరు షిర్డీ సాయి బాబా భక్తాలా? షిర్డీకి వెళ్లి సాయిబాబను దర్శించాలనుకుంటున్నారా? అయితే మీకు ఓ శుభవార్త.ఇండియన్ రైల్వేస్ టికెటింగ్ విభాగం ఐఆర్సీటీసీ మంచి ప్యాకేజీ అందుబాటులోకి తెచ్చింది.

 Hyderabad To Shirdi Three Days Tour Under Rs.400 The Details Are As Follows Ir-TeluguStop.com

సాయి శివం టూర్ పేరుతో హైదరాబాద్ నుంచి షిర్టీకి ప్యాకేజీ ప్రకటించింది.హైదరాబాద్ నుంచి ప్రతి శుక్రవారం ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది.

ఈ టూర్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమవుతుంది.సాయంత్రం 6.50 గంటలకు అజంతా ఎక్స్ ప్రెస్ ఎక్కాలి.మరుసటిరోజు ఉదయం 7.10 గంటలకు నాగర్ సోల్ రైల్వే స్టేషన్ చేరుకుంటారు.నాగర్ సోల్ నుంచి రోడ్డు ప్రయాణం ద్వారా షిర్డీ వెళ్తారు.

అక్కడ హోటల్ లో బస ఏర్పాటు చేస్తారు.ఆ తర్వాత షిర్డీ సాయి ఆలయ దర్శనం చేయిస్తారు.

ఆ రాత్రికి షిర్డీలో బస చేయాల్సి ఉంటుంది.తర్వాతి రోజు ఉదయం నాసిక్ కి వెళ్తారు.

అక్కడ త్రయంబకేశ్వరం, పంచవటి సందర్శనం ఉంటుంది.అక్కడి నుంచి నాగర్ సోల్ రైల్వే స్టేషన్ చేరుకుంటారు.రాత్రి 9.20 గంటలకు రైలు ఎక్కాలి.మరుసటి రోజు ఉదయం సికింద్రాబాద్ చేరుకుంటారు.ఈ టూర్ కి సంబంధించి మరిన్ని వివరాలకు https://www.irctctourism.com వెబ్ సైట్ లో చూడొచ్చు.

Telugu Hyderabad, Irctc, Shiridi, Packages-Latest News - Telugu

ప్యాకేజీ ధరలు ఇలా ఉన్నాయి.

* స్లీపర్ క్లాస్ ప్రయాణానికి డబుల్ ఆక్యుపెన్సీకి రూ.4,400, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.3,730 చెల్లించాలి.థర్డ్ ఏసీ ప్రయాణానికి అయితే డబుల్ ఆక్యుపెన్సీకి రూ.6,090, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.5,420 చెల్లించాలి.నలుగురి నుంచి ఆరుగురి వరకు బుక్ చేసుకుంటేనే ఈ ధరలు వర్తిస్తాయి.

* ఒకరి నుంచి ముగ్గురు బుక్ చేసుకుంటే.స్లీపర్ క్లాస్ ప్రయాణానికి సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.10,420, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.5,800, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.4,350.థర్డ్ ఏసీ ప్రయాణానికి అయితే సింగిల్ ఆక్యపెన్సీకి రూ.12,100, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.7,480, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.6,030 చెల్లించాల్సి ఉంటుంది.ప్యాకేజీలో భాగంగా స్లీపర్ లేదా థర్డ్ ఏసీ ప్రయాణంలో ఒక బ్రేక్ పాస్ట్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్, సైట్ సీయింగ్ కవర్ అవుతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube