కంగారులు గురించి మనకు తెలిసిందే.అవి పరిగెత్తడం చూస్తే ఎవరు అయినాసరే వారెవ్వా అని అనాలిసిందే.
అంత వేగంగా కంగారులు పరుగెత్తుతాయి.అలాగే ఈ కంగారులను ఆస్ట్రేలియా జాతీయ జంతువుగా కూడా పరిగణిస్తారు.
అక్కడ మనుషుల కంటే ఈ కంగారు జంతువులే ఎక్కువగా ఉంటాయి అనడంలో అతిశయోక్తి లేదనే చెప్పాలి.అయితే ఆస్ట్రేలియా అడవుల్లో మాత్రమే మనకు కనిపించే ఈ కంగారూలు త్వరలోనే మన హైదరాబాద్ జూ పార్క్ లో కూడా సందడి చేయనున్నాయి.
మరో రెండు నెలల్లో నెహ్రూ జూలాజికల్ పార్కులో రెండు కంగారులు రానున్నాయని జూ పార్కు క్యూరేటర్వీవీఎల్ సుభద్రా దేవి తెలిపారు.
అయితే ఆ కంగారుల ఎన్‌క్లోజర్ నిర్మాణ పనులకు అయ్యే ఖర్చు మొత్తాన్ని భరించడానికి దుండిగల్ లోని గ్లాండ్ఫార్మా షూటికల్ లిమిటెడ్ కంపెనీ ముందుకు వచ్చిందని తెలిపారు.
మూగ జీవాల పట్ల సానుకూలభావంతో ఫార్మా కంపనీ ముందుకు రావడం ఎంతో అభినందనీయమన్నారు సుభద్ర దేవి.ఇప్పటికే కంగారుల ఎన్‌క్లోజర్ నిర్మాణ పనుల నిమిత్తం రూ.20 లక్షల చెక్కును గ్లాండ్ ఫార్మా లిమిటెడ్ కంపెనీ బుధవారం జూ అధికారులకు అందచేసినట్లు తెలుస్తుంది.

ఈ సందర్భంగా జూ పార్కు క్యూరేటర్ వీవీఎల్ సుభద్రా దేవి మాట్లాడుతూ ఇలా అన్నారు.జంతు మార్పిడి పథకంలో భాగంగా జపాన్ లోని ఓఖ్లాహామా జూపార్కు నుంచి నెహ్రూ జూలాజికల్ పార్కుకు రెండు కంగారులు మరో రెండు నెలల్లో రాబోతున్నాయన్నారు.ఇవి జూ లోకి వచ్చిన తర్వాత వాటిని దత్తత తీసుకుంటామని ఫార్మా కంపెనీ ప్రతినిధులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రఘురాం, పి.సంపత్, స్వాతి తో పాటు జూ డిప్యూటి క్యూరేటర్ నాగమణి తదితరులు పాల్గొన్నారు.మరికొన్ని రోజుల్లో మనం అందరం కూడా జూ లో కంగారు జంతువులను చూడబోతున్నాం అన్నమాట.