తెలంగాణకు హైదరాబాద్ కామధేనువులాంటిదని మంత్రి కేటీఆర్ అన్నారు.హైదరాబాద్ లో కొత్తగూడ ప్లైఓవర్ ను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు.
హైదరాబాద్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు.కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమం లక్ష్యాలతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు.
రాబోయే 50 ఏళ్లకు సరిపడేలా కాళేశ్వరం, సుంకిశాల మంచినీటి సరఫరాకు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.ఈ ఏడాదిలో 11 ప్రాజెక్టులు పూర్తి చేస్తామని వెల్లడించారు.
గతంలో వచ్చిన వరదలను దృష్టిలో పెట్టుకుని స్ట్రాటజిక్ నాలా కార్యక్రమం చేపట్టామని పేర్కొన్నారు.మార్చి లేదా ఏప్రిల్ నాటికి స్ట్రాటజిక్ నాలా కార్యక్రమం పూర్తి చేశామని కేటీఆర్ తెలిపారు.
వంద శాతం సివరేజ్ నగరంగా హైదరాబాద్ రికార్డు సృష్టించబోతోందని వెల్లడించారు.







