త్వరలో లోక్ సభ ఎన్నికలు ( Lok Sabha Elections )రానున్న నేపథ్యంలో తెలంగాణలోని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది.ఈ మేరకు తాజాగా హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి పేరును బీఆర్ఎస్ ప్రకటించింది.
ఈ క్రమంలో హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా గడ్డం శ్రీనివాస్ యాదవ్( BRS Leader Gaddam Srinivas Yadav ) పేరును గులాబీ బాస్ కేసీఆర్ ఖరారు చేశారు.ఇప్పటివరకు 16 స్థానాలకు కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించగా తాజాగా మిగిలిన హైదరాబాద్ స్థానం అభ్యర్థిని సైతం ఖరారు చేశారు.
కాగా మొత్తం 17 పార్లమెంట్ స్థానాల్లో బరిలో దిగుతున్న బీఆర్ఎస్ మెజార్టీ స్థానాలను దక్కించుకొని సత్తా చాటాలని భావిస్తోంది.

మొత్తం 17 స్థానాల్లో ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా నామా నాగేశ్వర్ రావు, మహబూబాబాద్ అభ్యర్థిగా మాలోత్ కవిత, కరీంనగర్ అభ్యర్థిగా బోయినిపల్లి వినోద్ కుమర్, పెద్లపల్లి అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్, మహబూబ్ నగర్ అభ్యర్థిగా మన్నె శ్రీనివాస్ రెడ్డి, చేవెళ్ల – కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, వరంగల్ – కడియం కావ్య, నిజామాబాద్ – బాజిరెడ్డి గోవర్ధన్, మెదక్ – పి వెంకట్రామిరెడ్డి, జహీరాబాద్ – గాలి అనిల్ కుమార్, ఆదిలాబాద్ – ఆత్రం సక్కు, మల్కాజ్ గిరి – రాగిడి లక్ష్మారెడ్డి, నాగర్ కర్నూల్ – ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, నల్గండ – కంచర్ల కృష్ణారెడ్డి, భువనగిరి – క్యామా మల్లేష్, సికింద్రాబాద్ – తీగుళ్ల పద్మారావు గౌడ్ మరియు హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా గడ్డం శ్రీనివాస్ యాదవ్ పేరును ఖరారు చేశారు.
తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!