జ‌పాన్‌లో జంట‌గా ప‌డుకోని భార్యాభ‌ర్త‌లు.. కార‌ణం ఏమిటో తెలిస్తే...

జపాన్‌లోని జంటలు ఒకరినొకరు ప్రేమించుకోవడంలో ముందుంటారు.అయితే వారు క‌ల‌సి నిద్ర‌పోరు.

 Husband And Wife Sleep Separately In Japan , Japan , Husband And Wife, Sleep Sep-TeluguStop.com

ఒకరినొకరు అమితంగా ప్రేమించుకున్న తర్వాత కూడా జపాన్‌( Japan )లో జంటలు రాత్రిపూట కలిసి నిద్రించరు.వాస్తవానికి వారి సంబంధాన్ని మరింత బలోపేతం చేయడానికి ఇది జరుగుతుంది.29% జంటలు మాత్రమే కలిసి నిద్రపోతారు జపనీస్ గౌర్మెట్ వెబ్‌సైట్ గైడ్ టోక్యో ఫ్యామిలీస్ నివేదిక ప్రకారం 2017 వ సంవత్సరంలో దీనికి సంబంధించి ఒక సర్వే కూడా జ‌రిగింది.ఇందులో 20 నుండి 69 సంవత్సరాల వయస్సు గల 1,662 జంటలు పాల్గొన్నారు.అందులో 29.2% జంటలు మాత్రమే ఒకే బెడ్‌పై పడుకునేవారు.అనేక ఇతర నివేదికల ప్రకారం ఈ నిద్ర పద్ధతిని అవలంబించడం వెనుక మూడు ప్రధాన కారణాలు ఉన్నాయి.నిద్రించ‌డం, మేల్కొలపడానికి వేర్వేరు సమయం జపాన్‌లోని ప్రజలు ఒకరి మంచి నిద్రను మరొకరు చెడగొట్ట‌రు.

ఎవరైనా కలసి పడుకున్న తర్వాత ఒక‌రు ముందుగా నిద్ర లేవవలసి వస్తే, మరొకరి నిద్ర భంగ‌పడుతుంది.అటువంటి పరిస్థితిలో ఇద్దరూ విడివిడిగా పడుకోవడం ద్వారా తగినంత నిద్ర పొందడానికి పూర్తి సమయం ఇస్తారు.

శారీరక మరియు మానసిక ఆరోగ్యానికి మంచి నిద్ర ఎంత ముఖ్యమో జ‌పాన్ వారు బాగా గుర్తించారు.

Telugu Sleepseparately, Japan, Japanese, Japanesegourmet-Latest News - Telugu

పిల్లలు తల్లితో పడుకుంటారు జపాన్‌లో పిల్లలు ఎక్కువగా తమ తల్లులతో పడుకుంటారు.ఫ‌లితంగా పిల్లల హృదయ స్పందన కూడా బాగా నియంత్రింత‌మ‌వుతుంది.అటువంటి పరిస్థితిలో పిల్ల‌లు తల్లితో పడుకోవాలా లేదా విడిగా పడుకోవాలా అనేది తండ్రి నిర్ణయిస్తారు.

నాణ్యమైన నిద్ర దృక్కోణం నుండి చూస్తే.విడివిడిగా నిద్రించే జంటల మధ్య ప్రేమ లేదని అంద‌రూ భావించినప్పటికీ జపాన్‌లో ఇది నాణ్యమైన నిద్ర కోణం నుండి చ‌క్క‌గా కనిపిస్తుంది.

జపాన్‌లోని జంటలు తమ భాగస్వామి గదిలో ఉండటం వల్ల వారి నిద్రకు అంతరాయం కలగడం ఇష్టం లేదు.ఈ కారణంగా వారు ప్రారంభంలో విడిగా నిద్రపోతారు.

వ్యక్తిగత అభిప్రాయానికి ప్రాముఖ్య‌త‌ అయితే, సామాజిక సంస్కృతి దేశం నుండి దేశానికి మారుతుంది.ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత భావజాలం కూడా దీనిని ప్రభావితం చేస్తుంది.

జపనీస్ సంస్కృతిలో, ఒకరి శరీరంతో బాహ్య సంబంధాన్ని తగ్గించడం అనేది ప్రజలలో సాధారణం.అందువల్ల చాలా మంది జపనీస్ ఇళ్లలో, భార్యాభర్తలు ఒకే గదిలో పడుకోరు.

సింపుల్‌గా చెప్పాలంటే, జపాన్‌లో భార్యాభర్తలు రాత్రిపూట విడివిడిగా ప‌డుకోవ‌డం సర్వసాధారణం.అయితే ఇందులో కొంత వ్యక్తిగత అభిప్రాయానికి ప్రాధాన్య‌త ఉంది.

జ‌పాన్ జంట‌ల్లో ఎవరైనా విడిగా పడుకోవాలనుకుంటే వారు నిరభ్యంత‌రంగా నిద్రపోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube