BB Nagarjuna Costumes: బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున కాస్ట్యూమ్ పై భారీ ట్రోలింగ్స్.. కోటిలో వందకే దొరుకుతాయంటూ కామెంట్స్!

తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న బిగ్ బాస్ కార్యక్రమం ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది.ఈ కార్యక్రమం తెలుగులో ప్రస్తుతం ఆరవ సీజన్ ప్రసారం అవుతుంది.

 Huge Trolling On Bigg Boss Host Nagarjunas Costume Details, ,bigg Boss Host Naga-TeluguStop.com

ఈ కార్యక్రమానికి గత మూడు సీజన్లో నుంచి నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.ఇలా నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ ఈ కార్యక్రమంలో వేసుకొనే కాస్ట్యూమ్స్ గురించి ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.

వీకెండ్ నాగార్జున విభిన్నమైన కాస్ట్యూమ్స్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

ఈ కార్యక్రమం కోసం నాగార్జున ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కి సంబంధించిన దుస్తులను ఉపయోగిస్తూ ఉంటారు వీటి ధర ఒక్కొక్కటి లక్షల్లోనే ఉంటుందని చెప్పాలి.

ఇలా లక్షల్లో విలువచేసే నాగార్జున ఈ దుస్తుల గురించి తాజాగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ మొదలయ్యాయి.నాగార్జున బిగ్ బాస్ కార్యక్రమం కోసం దాదాపు రెండు మూడు లక్షల విలువ చేసే దుస్తులను వేసుకుంటున్నారని తెలియడంతో నేటిజన్స్ ఇలాంటివి మన హైదరాబాద్ కోటిలో కూడా దొరుకుతాయి అంటూ కామెంట్లు చేస్తున్నారు.

అచ్చం ఇలాంటి చొక్కాలను కోటిలో వంద రూపాయలకే కొనుగోలు చేయవచ్చని కానీ నాగార్జున మాత్రం లక్షలు పోసి కొనుగోలు చేస్తున్నారంటూ భారీగా నాగార్జున కాస్ట్యూమ్స్ పై ట్రోల్స్ చేస్తున్నారు.ఇకపోతే బిగ్ బాస్ సీజన్ సిక్స్ కార్యక్రమం చివరి దశకు చేరుకుంది మరో రెండు వారాలలో ఈ కార్యక్రమం పూర్తి కానుంది.ఇక ఈ సీజన్ విన్నర్ రేవంత్ అంటూ ఇప్పటికే ఎంతోమంది బిగ్ బాస్ విన్నర్ ని కూడా ప్రకటించేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube