వామ్మో ఇవేం చేప‌లు.. ఇట్టే దొర‌క‌బ‌ట్టొచ్చు..!

చేప‌ల కూర అంటే ఇష్టం ఉండ‌ని వారెవ‌రుంటారు చెప్పండి.ఒక్క‌సారైనా పులస చేప‌లు తినాల‌నుకునే వారు దేశంలో ఎంతోమంది ఉన్నారంటేనే ప‌రిస్థితి అర్థ‌మవుతుంది.

మ‌రి అస‌లు ఇప్పుడు వ‌ర్షాకాల సీజ‌న్ కావ‌డంతో చాలామంది ఈ చేప‌ల కూర‌ల‌కు చాలా ఆస‌క్తి చూపిస్తుంటారు.ఇక ఎవ‌రైనా ఇంట్లోకి ఒక‌టి లేదా రెండు కిలోల చేప‌ల‌ను కొనుక్కుని తీసుకెళ్తుంటారు.

కానీ ఓ చోట మాత్రం గంప‌ల్లో తీసుకెళ్తాన్నారండి.అదికూడా మ‌ళ్లీ ఫ్రీగానే అంటే న‌మ్మండి.

అస‌లు అస‌లు విష‌యానికి వ‌స్తే పులిచింతల ప్రాజెక్టు చుట్టు ప‌క్క‌ల గ్రామాల ప్రజలు ఇలా చేప‌ల పండుగ చేసుకుంటున్నారు.విష‌యం ఏంటంటే రీసెంట్‌గా పులిచింతల ప్రాజెక్టుకు సంబంధించిన 16వ క్రస్ట్ గేటు విరిగిపోయిన సంగ‌తి అంద‌రికీ విదిత‌మే.

Advertisement

కాగా ఈ గేటు వ‌ల్ల ప్రాజెక్ట్‌లో ఉన్న నీరంతా కూడా దిగువకు వ‌చ్చేసింది.ఇక చాలా క‌ష్టాల త‌ర్వాత ఆఫీస‌ర్లు గేట్లు మూసివేయడంతో కాలువలో నీళ్లు మొత్తం త‌గ్గిపోయాయి.

ఇక ఇప్ప‌టి వ‌ర‌కు పారిన నీటిలో ఉన్న చేప‌ల‌న్నీ కూడా ఎక్క‌డిక‌క్క‌డ బయటపడుతున్నాయి.వాగుల్లో ఎక్క‌డ చూసినా కూడా కుప్పలుగా చేపలు ద‌ర్శ‌న‌మిస్తుండ‌టంతో స్థానికులంతా ఈ చేప‌ల‌ను ప‌ట్టుకుంటున్నారు.

ఏకంగా గంపల కొద్దీ నింపేసుకుని పట్టుకుని ఇంటికి తీసుకెళ్తున్నారు.

వాస్త‌వానికి పులిచింతల అనేది చాలా పెద్ద ప్రాజెక్టు కావ‌డంతో విరిగిపోయిన గేటును వెంట‌నే ఆఫీస‌ర్లు స‌రిచేసి దాని ప్లేస్‌లో స్టాప్‌ లాగ్‌ గేటును అమ‌ర్చి ప్రాజెక్టులోని నీరంతా బ‌య‌ట‌కు పోకుండా ఏర్పాట్లు చేశారు.చాలా త‌క్కువ టైమ్‌లోనే ఇలా ప్రాజెక్టులో నీటి నిల్వకు అడ్డుకోవ‌డంలో స‌క్సెస్ కావ‌డంతో ఆఫీస‌ర్ల ప‌నితీరును అంతా మెచ్చుకుంటున్నారు.కానీ ఇలా గేటును బాగు చేయ‌డంతో ఆ చుట్టు ప‌క్క‌ల ఉన్న ఊర్ల‌కు మంచిదైంద‌నే చెప్పాలి.

నైజాంలో కంగువకు భారీ షాక్.. పుష్ప ది రూల్ కు సైతం ఇబ్బందులు తప్పవా?
రీల్స్ పిచ్చి తగలయ్య.. బైక్ పై మరో బైక్ ఉంచి యువకుల సాహసాలు..

ఎందుకంటే వారికి చేప‌లు కుప్ప‌లు, తెప్ప‌లుగా దొర‌కుతున్నాయి.ప్ర‌స్తుతం ఈ చేప‌ల‌కు సంబంధించిన వీడియోలు నెట్టింట వైర‌ల్‌గా మారుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు