నీకోసం యుద్ధ భూమిలో ఎదురుచూస్తున్నా... తారక్ కి బర్త్ డే విషెస్ చెప్పిన హృతిక్.. పోస్ట్ వైరల్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) నేడు తన 40వ పుట్టినరోజు(Birthday) వేడుకలను జరుపుకుంటున్నారు.ఈ క్రమంలోని పెద్ద ఎత్తున ఎన్టీఆర్ కి సినీ సెలబ్రిటీల నుంచి మొదలుకొని అభిమానుల వరకు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

 Hrithik Roshan Wishes Tarak On His Birthday Details, Ntr,birthday,hrithik Roshan-TeluguStop.com

ఈ క్రమంలోనే ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ (Hrithik Roshan) ఎన్టీఆర్ కి స్పెషల్ గా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా వార్ 2 లో ఎన్టీఆర్ నటించబోతున్నారంటూ క్లారిటీ ఇచ్చేశారు.

గత కొద్దిరోజులుగా ఎన్టీఆర్ హృతిక్ రోషన్ నటిస్తున్న వార్ 2 (War 2) సినిమాలో కీలకపాత్రలో నటించబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి.అయితే ఇప్పటివరకు ఈ విషయం గురించి అధికారిక ప్రకటన ఎక్కడ వెలువడలేదు.తాజాగా ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా హృతిక్ రోషన్ తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ పరోక్షంగా ఎన్టీఆర్ వార్ 2 లో నటించబోతున్నారంటూ తెలియజేశారు.

దీంతో ఎన్టీఆర్ అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

హృతిక్ రోషన్ సోషల్ మీడియా వేదిక స్పందిస్తూ ఎన్టీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ… హ్యాపీ బర్త్ డే తారక్(Happy Birthday Tarak) .నీ జీవితంలో ఎంతో సంతోషకరమైన ఈ రోజున నువ్వు ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను.నీకోసం నేను యుద్ధభూమి(Yuddha Bhumi) లో ఎదురు చూస్తున్నాను.

మనం కలిసే వరకు నువ్వు నీ ప్రతిరోజు నువ్వు చాలా ప్రశాంతంగా శాంతియుతంగా గడపాలని కోరుకుంటున్నాను.మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు మిత్రమా అంటూ హృతిక్ రోషన్ ఎన్టీఆర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ వార్ 2 గురించి కూడా క్లారిటీ ఇచ్చేశారు.

ప్రస్తుతం హృతిక్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube