శబరిమల( Sabarimala ), ఈ పేరు చెప్తేనే చాలామంది భక్తులు భక్తి భావంతో పొంగిపోతారు.
ఇక కార్తీకమాసం వచ్చిందంటే చాలు అందరూ అయ్యప్ప దీక్షపరులతో, అయ్యప్ప నామస్మరణతో మారుమోగిపోతూ ఉంటాయి.
అయ్యప్పను చాలామంది ఎంతో ఇష్టంగా కొలుస్తారు.ఎంతో మంది దేవుళ్ళు ఉన్నా కూడా అయ్యప్ప స్వామికి ఓ ప్రత్యేకత ఉంది.
అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు.అయితే ఈ స్వామికి ప్రత్యేకమైన పాట కూడా ఉంది.
అయితే ఆ ప్రత్యేకమైన పాట ఏమిటంటే పవళింపు పాట.అయ్యప్ప స్వామి హరివరాసనం పాట సీనియర్ గాయకుడు ఏసుదాసు( Yesudas ) పాడారు.అయ్యప్ప స్వామికి పవళింపుగా ఈ పాటను ఆలపిస్తారు.
అయితే ఈ పాట ఎంత విన్నా కూడా తనివి తీరదు.శబరిమల మణికంఠుని సన్నిదానంలో అయితే తన్మయత్వంలో పులకించుకోక తప్పదు.ఇక ఈ పాట ఎలా పుట్టింది? ఎవరు రచించారు? మొదటగా ఎవరు పాడారు? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.శబరిమలలో హరివరాసనం పాడుతున్న సమయంలో ఎలాంటి వాతావరణం ఎలా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు.
అయ్యప్ప పూజలు చేసిన తర్వాత చివరగా ఈ పాటను పాడడం ఒక సంప్రదాయంగా వస్తుంది.ఇదే విధానాన్ని ఇతర అయ్యప్ప ఆలయాల్లోనూ, ఇతర పూజ కార్యక్రమాల్లో, ఉత్సవాల్లో కూడా ఆలపిస్తారు.
ఈ అయ్యప్పస్వామి పవళింపు స్తోత్రాన్ని కుంభకుడి కులత్తూర్ అయ్యర్( kumbakudi kulattur ayyar ) రచించడం జరిగింది.
అయితే 1955లో స్వామి విమోచనానంద అయ్యర్ ఈ స్తోత్రాన్ని శబరిమలలో ఆలపించారు.ఇక 1940-55 దశకాల్లో శబరిమలలోని నిర్మానుష కాలంలో విఆర్ గోపాలమీనన్ అనే భక్తుడు స్వామి వారి ఆలయ సమీపంలో జీవిస్తూ ఉండేవాడట.స్వామివారికి ఆయన ప్రత్యేక పూజలు చేస్తూ ఈ హరివరాసనాన్ని పఠిస్తూ ఉండేవారట.
అప్పట్లో ఈశ్వర్ నంభుత్రి అనే తాంత్రి స్వామి వారికి పూజలు చేస్తూ ఉండేవారు.ఆ తర్వాత గోపాలమీనన్ శబరిమల నుండి వెళ్లిపోయాక అతను మరణించాడు అనీ తెలుసుకొని, తీవ్రంగా బాధపడి, దుఃఖించిన ఈశ్వర్ నంభుత్రి తాంత్రి ఆ రోజు ఆలయం మూసే సమయంలో హరివరాసనం స్తోత్రం చదివేవారట.
ఇక అప్పటినుండి శబరిమలలో ఈ సాంప్రదాయం కొనసాగుతూ వస్తోంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy