మంచి నీటి ప్రాముఖ్యత గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.నీటిని పోదుపుగా వాడి భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ప్రస్తుతం ప్రపంచం నీటి కొరతను ఎదుర్కొంటుంది.మానువుని మనుగడుకు నీరు అత్యవసరం.
ప్రతేడాది ప్రతి సంవత్సరం మార్చి 22న ప్రపంచ నీటి దినోత్సవంగా జరుపుకుంటారు.నీటి సంక్షోభానికి వ్యతిరేకంగా పోరాడటమే ఈ రోజు ప్రత్యేకత.
పెరుగుతున్న ఉష్ణ్రోగత, జనాభా కారణంగా మనం నీటి సమస్యను అధిగమించాల్సి ఉంది.
నేడు ప్రతి ముగ్గురిలో ఒకరు సురక్షితమైన నీటిని తాగడం లేదు.2050 నాటికి 5.7 బిలియన్ల మంది ప్రజలు సంవత్సరానికి కనీసం నెల పాటు నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో నివసిస్తున్నారని చెప్పొచ్చు.ప్రతేడాది 3,60,000 కంటే ఎక్కువ మంది శిశువుల జీవితాలను వాతావరణ తట్టుకొనే నీటి సరఫరా, పారిశుధ్యం ద్వారా రక్షించుకోవచ్చని ఐక్యరాజ్యసమితి తెలియజేసింది. గ్లోబల్ వార్మింగ్ ను పారిశ్రామిక స్థాయి కంటే 1.5 డిగ్రీల సెల్సియస్ కు పరిమితం చేస్తే వాతావరణ ప్రేరిత నీటి ఒత్తిడిని 50% తగ్గించే అవకాశం ఉంటుంది.
పళ్లు తోముకోవడం, షేవింగ్ చేయడం, చేతులు కడుక్కోవడం మొదలైన వాటిలో ప్రజలు నీటిని వృథా చేయకుండా ట్యాప్ ను ఆఫ్ చేయాలి.
మొదటగా షవర్లకు బదులుగా బకెట్లను ఉపయోగించడం మంచింది.అడవులు అంతరించిపోవడం వల్ల ఉష్ణ్రోగ్రత పెరిగి వర్షపాతం కూడా తక్కువ స్థాయిలో కురుస్తోంది.ముఖ్యంగా వర్షపు నీటిని ఉపయోగించి బట్టలు ఉతకడం, మొక్కలకు నీరు పెట్టడం వంటివి చేయాలి.కూరగాయాలు కడగటానికి ఉపయోగించిన నీటిని మొక్కలకు నీరు పెట్టడానికి ఉపయోగించాలి.పైప్ లైన్ లీకేజీలను ఎప్పటికప్పుడు అరికట్టాలి.మనం ఇప్పుడు నీటిని ఆదా చేస్తే భవిష్యత్ తరాలకు నీటిని అందించే అవకాశం ఉంటుంది.
ఇప్పటినుంచి అయినా అందరూ నీటిని పొదుపు చేయడానికి జాగ్రత్తలు పాటించి, నీటి వృథాను అరికట్టాలి.