ప్రముఖ ఇన్‌స్టాంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్( WhatsApp ) ఎంతటి జనాధరణ కలిగి వుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.మిలియన్ల సంఖ్యలో ప్రజలు ఈ యాప్‌ను వినియోగిస్తున్నారు.
ఈ క్రమంలో ఈ మాధ్యమం ద్వారా నిత్యం వేలాది మెసేజ్‌లు, ఫోటోలు, వీడియోస్ షేర్ కాబడుతూ వుంటాయి.కొన్ని కీలకమైన డాక్యూమెంట్స్ కూడా ఇపుడు వాట్సాప్ ద్వారానే షేర్ చేసుకుంటున్న పరిస్థితి.
అయితే, కొన్నిసార్లు అనుకోకుండానే కొన్ని ముఖ్యమైన ఫోటోలు, వీడియోలో డిలీట్ అవుతాయి.మీరు ఇలాంటి సమస్యను ఎదుర్కొంటే ఇక భయపడాల్సిన పనిలేదు.
డిలీట్ అయిన ఫోటోలు, వీడియోలను తిరిగి పొందవచ్చు.

ఎలాగంటే? వీటిని తిరిగి పొందడానికి పెద్ద టెక్నికల్ నాలేడ్జ్ కూడా ఏమీ అవసరం లేదు.సంబంధించి ఈ స్పెషల్ ట్రిక్ పై ఓసారి లుక్కేస్తే సరిపోతుంది.డీఫాల్ట్‌గా వాట్సాప్‌కు సంబంధించి అన్ని ఫోటోలు, వీడియోలు ఆండ్రాయిడ్, ఐఫోన్ రెండింటి ఫోన్ గ్యాలరీలో( Phone Gallery ) సేవ్ అవుతుంటాయి.
మీ వాట్సాప్ నుంచి వీడియో, ఫోటో, డాక్యూమెంట్ ఫైల్ ఏదైనా డిలీట్ అయితే వాటిని ఫోన్ గ్యాలరీలో తిరిగి పొందవచ్చు.అదేవిధంగా ఇక్కడ మీరు ఫైల్ ఎక్స్‌ప్లోరర్( File Explorer ) గురించి తెలుసుకోవాలి.

ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ వినియోగదారులకు(Android Users ) మాత్రమే అందుబాటులో కలదు.ఆండ్రాయిడ్ వినియోగదారులు ఫైల్ ఎక్స్‌ప్లోరర్‌లోని వాట్సాప్ ఫోల్డర్‌కు వెళ్లడం ద్వారా మీడియా ఫైల్‌ల నుండి తొలగించబడిన ఫోటోలు, వీడియోలను తిరిగి పొందవచ్చు.అదేవిధంగా వాట్సాప్ బ్యాకప్( WhatsApp Backup ) కూడా వాడుకోవచ్చు.మీరు వాట్సాప్ చాట్‌లు, మీడియాను రోజువారీ, వారం, నెలవారీ ప్రాతిపదికన బ్యాకప్ చేయవచ్చు.అదేవిధంగా డిలీట్ మీడియా ఆప్షన్‌ను ఆఫ్ చేసినా సరిపోతుంది.కొన్నిసార్లు మనం చాట్‌ని డిలీట్ చేసినప్పుడు కొన్ని ముఖ్యమైన మీడియా ఫైల్స్ కూడా పొరపాటున డిలీట్ అవుతుంటాయి.
ఈ సమస్య నుంచి బయటపడేందుకు చాట్‌ను డిలీట్ చేసే ముందు.డిలీట్ మీడియా ఆప్షన్( Delete Media )ను టిక్ చేయకుండా ఉండండి.