ఓట్స్.వీటి గురించి పరిచయాలు అవసరం లేదు.
ఇటీవల కాలంలో అందరి ఇళ్లలో ఓట్స్ ను విరివిరిగా వాడుతున్నారు.ముఖ్యంగా హెల్త్, ఫిట్ నెస్ పై శ్రద్ధ ఉన్నవారు తప్పకుండా తమ డైట్ లో ఓట్స్( Oats ) ను చేర్చుకుంటారు.
ఎన్నో అద్భుతమైన పోషకాలను కలిగి ఉన్న ఓట్స్ ఆరోగ్యపరంగా అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది.అలాగే చర్మ సౌందర్యానికి కూడా ఓట్స్ ఎంతో మేలు చేస్తాయి.
ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే విధంగా ఓట్స్ తో సీరంను తయారు చేసుకుని ప్రతిరోజు వాడితే మీరు ఊహించని స్కిన్ కేర్ బెనిఫిట్స్ మీ సొంతం అవుతాయి.మరి ఇంకెందుకు ఆలస్యం ఓట్స్ తో సీరంను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక బౌల్ లో రెండు టేబుల్ స్పూన్లు ఓట్స్, ఒక కప్పు కొబ్బరి పాలు( Coconut milk ) వేసుకుని గంట పాటు నానబెట్టుకోవాలి.ఈలోపు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ పోయాలి.వాటర్ హీట్ అవ్వగానే అందులో రెండు టేబుల్ స్పూన్లు అవిసె గింజలు( Flax seeds ) వేసి పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉడికించాలి.ఆపై పల్చటి వస్త్రం సహాయంతో అవిసె గింజల జెల్ ను సపరేట్ చేసుకోవాలి.
ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో నాన పెట్టుకున్న ఓట్స్ ను కొబ్బరిపాలతో సహా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుండి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఈ జ్యూస్ లో ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్న అవిసె గింజల జెల్ ను వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.చివరిగా వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్, నాలుగు చుక్కలు లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్( Lavender essential oil ) వేసుకుని అన్ని కలిసేంత వరకు మరోసారి మిక్స్ చేయాలి.
అంతే మన సీరం సిద్ధం అయినట్టే.ఈ సీరంను ఒక బాటిల్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.రోజు నైట్ నిద్రించే ముందు ముఖానికి ఈ సీరం అప్లై చేసుకోవాలి.రెగ్యులర్ గా ఈ సీరం ను వాడటం వల్ల స్కిన్ టోన్ ఇంప్రూవ్ అవుతుంది.
చర్మం టైట్ గా, బ్రైట్ గా మారుతుంది.డ్రై స్కిన్ నుంచి విముక్తి లభిస్తుంది.
చర్మం కోమలంగా, కాంతివంతంగా మెరిసిపోతుంది.వయసు పైబడిన సరే యవ్వనంగా కనిపిస్తారు.
మొటిమలు, వాటి తాలూకు మచ్చలు ఉంటే మాయం అవుతాయి.
.