ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా సేవించే పానియాల్లో కాఫీ ముందు వరసలో ఉంటుంది.అందులో ఎటువంటి సందేహం లేదు.
కాఫీ ఆరోగ్యానికి మంచిది కాదని కొందరు అంటుంటారు.కానీ, లిమిట్‌గా తీసుకుంటే అది మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది.
ఇక కాఫీ పౌడర్..
కాఫీని తయారు చేసుకోవడానికి మాత్రమే యూస్ అవుతుందని అనుకుంటే పొరపాటే అవుతుంది.కాఫీ పౌడర్ అనేక విధాలుగా మనకు ఉపయోగపడుతుంది.
చర్మ సౌందర్యాన్ని పెంచుకునేందుకు, జుట్టు సంరక్షణకు కాఫీ పౌడర్‌ను విరి విరిగా వినియోగిస్తుంటారు.అలాగే కాఫీ పౌడర్ తో బాడీ వైటనింగ్ సోప్‌ను కూడా తయారు చేసుకోవచ్చు.
అదెలాగో ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక సోప్ బేస్‌ను తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఈ ముక్కలను ఒక బౌల్‌లో వేసుకుని డబుల్ బాయిలర్ మెథడ్‌లో మెల్ట్ చేసుకోవాలి.మెల్ట్ చేసుకున్న సోప్ బేస్‌లో రెండు టేబుల్ స్పూన్ల కాఫీ పౌడర్, వన్ టేబుల్ స్పూన్ గ్లిజరిన్, హాఫ్ టేబుల్ స్పూన్ విటమిన్ ఇ ఆయిల్, హాఫ్ టేబుల్ స్పూన్ ఆర్గానిక్ పసుపు వేసుకుని అన్నీ కలిసే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి.

ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ప్లాస్టిక్ బాక్స్‌ల్లోకి నింపి.మూడు, నాలుగు గంటల పాటు వదిలేస్తే కాఫీ సోప్ సిద్దం అవుతుంది.ఈ కాఫీ సోప్‌ను రెగ్యులర్‌గా యూస్ చేస్తే గనుక బాడీ వైట్‌గా మరియు బ్రైట్‌గా మారుతుంది.చర్మంపై ముదురు రంగు మచ్చలు ఏమైనా ఉంటే క్రమంగా తొలగిపోతాయి.
సన్ ట్యాన్ సమస్య నుండి విముక్తి లభిస్తుంది.వయసు పైడిన లక్షణాలు త్వరగా దరి చేరకుండా ఉంటాయి.
చర్మం మృదువుగా మారుతుంది.మరియు బాడీ నుండి మంచి సువాసన సైతం వస్తుంది.







