ఒక మెసేజ్ తో మీ ఆధార్ కార్డుకి పాన్ కార్డు లింక్ చేయండి ఇలా

జులై 1, 2017 .ఈ తేదిని గుర్తుపెట్టుకోండి.

 How To Link Aadhar And Pan Card With Sms ?-TeluguStop.com

ఎందుకంటే మీ ఆధార్ కార్డుని పాన్ కార్డుతో లింక్ చేయాల్సిన గడువుతేది ఇదే.అన్ని ప్రభుత్వ సర్వీసుల కోసం ఆధార్ కార్డు లింక్ ని వాడుతున్న ప్రభుత్వం, ఇకనుంచి పాన్ కార్డు సర్వీసులు అందించాలంటే కూడా ఆధార్ కార్డుని అడగనుంది.అందుకే మీ పాన్ కార్డుని ఆధార్ కార్డుతో తప్పకుండా లింక్ చేయాల్సిన అవసరం ఏర్పడింది.మరి లింక్ ఎలా చేయాలి ? మీరేమి ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు.ఇంట్లో కూర్చొనే తాపిగా అనుసంధానం చేసుకోవచ్చు.అది కూడా ఒక్క మెసేజ్ తో.ఎలానో చూడండి.

మీకు జాతీయదినపత్రికలు చదివే అలవాటు ఉంటే ప్రత్యకేంగా చెప్పాల్సిన అవసరం లేదు కాని, చదివే అలవాటు లేకపోతే మాత్రం ఈ విషయాన్ని పూర్తిగా చదవండి.

ఎస్ఏంఎస్ ద్వారా పాన్ కార్డుని ఆధార్ తో లింక్ చేసుకునే వేసులుబటుని కల్పిస్తోంది ఆదాయ పన్ను శాఖ.ఈ విషయం మీద ప్రజలకు చైతన్యం కలిగించేందుకు అన్ని జాతియ పత్రికల్లో ప్రకటనలు ఇచ్చింది.మీరు ఆధార్ కార్డుని పాన్ కార్డుతో అనుసంధానం చేసుకోవడానికి ఎస్ఏంఎస్ పంపాల్సిన నంబర్లు 567678 లేదా 56161.

ఎస్ఏంఎస్ ఎలా పంపాలి, ఏం పంపాలి అంటే, UIDPAN అని టైప్ చేసి, స్పేస్ ఇచ్చి మీ ఆధార్ కార్డు నంబర్ ని ఎంటర్ చేయండి.

దాని తరువాత మరోసారి స్పేస్ ఇచ్చి పాన్ కార్డు నంబర్ ని ఎంటర్ చేయండి.టెంప్లేట్ చూపించాలంటే UIDPAN<12 digit Aadhar Number><10 digit PAN number).

ఈ మెసేజ్ ని 567678 లేదా 56161 నంబర్ కి ఎస్ఏంఎస్ చేయండి.అంతే, మీ పని అయిపొయింది.

కాసేపటికి మీకు పాన్ కార్డు ఆధార్ కార్డు అనుసందాన్ని కన్ఫర్మ్ చేస్తూ అదే మొబైల్ నంబర్ కి మెసేజ్ వస్తుంది.ఇలా వద్దు అనుకుంటే మీరు ఆదాయ పన్ను శాఖకి చెందినా efiling website లో కూడా ఈ లింక్ ప్రక్రియ పూర్తీ చేయవచ్చు.

మీ వివరాలలో చిన్న చిన్న పొరపాట్లు కనిపించినా కంగారు పడకుండా మీ ఆధార్ నంబర్, పాన్ నంబర్ సరిగా ఉన్నాయో లేదో చూసుకుంటే చాలు.పని పూర్తయిపోతుంది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube