ఓటరు స్లిప్పు ఇంకా అందలేదా.. ఈ విధంగా చేస్తే మాత్రం సులభంగా ఓటు వేయవచ్చట!

తెలంగాణ రాష్ట్రంలో పోలింగ్ కు మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది.ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రముఖ సెలబ్రిటీలు పిలుపునిస్తున్నారు.

 How To Know Voter Slip Details Here Goes Viral In Social Media , Voter Slip, Te-TeluguStop.com

అయితే ఇప్పటికీ ఓటరు స్లిప్పు అందని వాళ్లు ఓటు హక్కును ఎలా వినియోగించుకోవాలో అని టెన్షన్ పడుతున్నారు.అయితే ఓటర్ స్లిప్పు( Voter slip ) అందని వాళ్లు ఓటింగ్ కు దూరంగా ఉండకుండా ఓటు హక్కును వినియోగించుకోవచ్చు.

Telugu Exit, Telangana, Voteridentity, Voter Slip-Latest News - Telugu

మన ఓటుకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవడం చాలా సులువు. ఎన్నికల సంఘం( Election Commission ) వేర్వేరు మార్గాలను అందుబాటులో ఉంచగా ఆ మార్గాల ద్వారా ఓటుకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.ఎస్.ఎం.ఎస్ ద్వారా ఓటర్ గుర్తింపు కార్డ్ నంబర్ ( Voter Identity Card Number _ను 1950 లేదా 92117 28082 నంబర్లకు మెసేజ్ చేయడం ద్వారా పోలింగ్ కేంద్రం వివరాలను మెసేజ్ రూపంలో తెలుసుకుని ఓటుహక్కును వినియోగించుకోవచ్చు.

Telugu Exit, Telangana, Voteridentity, Voter Slip-Latest News - Telugu

1950 టోల్ ఫ్రీ నంబర్ కు ఫోన్ చేయడం ద్వారా కూడా పోలింగ్ కేంద్రం, బూత్ నంబర్, క్రమ సంఖ్య వివరాలను తెలుసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది.ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని పోలింగ్ కేంద్రాల చిరునామా, ఫోటోలు, గూగుల్ మ్యాప్ కు సంబంధించిన వివరాలను తెలుసుకోవచ్చు.www.ceotelangana.nic.in వెబ్ సైట్ ద్వారా కూడా ఈ వివరాలను తెలుసుకోవచ్చు.తెలంగాణ( Telangana )లో ఏ పార్టీ గెలుస్తుందనే ప్రశ్నకు సరైన సమాధానం దొరకడం లేదు.ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఏ పార్టీకి అనుకూలంగా ఉంటాయో చూడాల్సి ఉంది.అన్ని పార్టీలు ఎన్నికల్లో విజయం కోసం ఎంతో కష్టపడుతున్నాయి.

సామాన్య ప్రజలు పోలింగ్ కు దూరంగా ఉండవద్దని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలని పలువురి నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండగా ఆ అభిప్రాయాలు వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube