ఎమర్జెన్సీ ఫండ్స్ ఎలా దాచుకోవాలి.. ఈ టిప్స్ పాటించండి..

ప్రతిఒక్కరికీ లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్( Life Insurance, Health Insurance ) అనేవి అవసరం.కష్టకాలంలో ఇవి చాలా ఉపయోగపడతాయి.

మన కుటుంబానికి కూడా ఆర్ధికంగా సహాయపడతాయి.అలాగే ఎమర్జెన్సీ ఫండ్ కూడా అందరికీ అవసరం.

ఊహించని ఆర్దిక పరిస్థితుల నుంచి ఎమర్జెన్సీ ఫండ్ కాపాడుతుంది.రెండు లేదా ఆరు నెలల ఖర్చులను కవర్ చేసే విధంగా ఎమర్జెన్సీ ఫండ్ ను క్రియేట్ చేసుకోవడం అవసరమని ఆర్దిక నిపుణుల సూచిస్తున్నారు.

కరోనా లాంటి మహమ్మారి తర్వాత ఒక సంవత్సరానికి అవసరమయ్యే ఎమర్జెన్సీ ఫండ్ ( Emergency Fund )ను భద్రపరుచుకోవడం చాలా ముఖ్యమని చెబుతున్నారు.

Advertisement

ఎమర్జెన్సీ ఫండ్ కోసం సేవింగ్స్ అకౌంట్స్, మనీ మార్కెట్ అకౌంట్స్, డిపాజిట్ సర్టిఫికేట్ వంటి లిక్విడ్ అస్సెట్స్ ( Liquid assets )లో పెట్టుబడి పెట్టాలని చెబుతున్నారు.దీని వల్ల డబ్బులు అవసరమైనప్పుడు ఈజీగా విత్ డ్రా చేసుకోవచ్చు.అలాగే ఎమర్జెన్సీ ఫండ్ కి సంబంధించి స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టకూడదని చెబుతున్నారు.

ఎమర్జెన్సీ ఫండ్ ను సమకూర్చుకునేటప్పుడు అప్పులు తగ్గించుకోవాలని చెబుతున్నారు.లోన్లు కూడా తీసుకోవద్దని, అప్పులు ఏమైనా ఉంటే చెల్లించడానికి ప్రాధాన్యత ఇవ్వాలని చెబుతున్నారు.

అలాగే అనుకూలమైన యాన్యువల్ ఫీజు( Annual Fee ) లేని అకౌంట్లను ఎంచుకోవాలని చెబుతున్నారు.మంచి రిటర్న్ అందించేవాటిని మాత్రమే సెలక్ట్ చేసుకోవాలి.అలాగే ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు ఆదాయ వనరులను పర్యవేక్షించాలని చెబుతున్నారు.

ఎమర్జెన్సీ ఫండ్ ను అవవసరమైన ఖర్చుల కోసం విత్ డ్రా చేయవద్దని చెబుతున్నారు.ఎంటర్‌టైన్‌మెంట్ లేదా భోజనాల వంటి వాటిపై అవసరమైన ఖర్చులను తగ్గించండి.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

చిన్న మొత్తంలో ఎమర్జెన్సీ ఫండ్ ను ప్రారంభించాలి.అలాగే ఎన్ని నెలకు సరిపడ డబ్బులు ఆదా చేయాలనుకుంటున్నారో ముందుగానే నిర్ణయించుకోవాలని అంటున్నారు.

Advertisement

ఇలా చేయడం వల్ల అత్యవసర సమయంలో ఉఫయోగపడతాయి.

తాజా వార్తలు