పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే ఈజీగా ఈ రెమెడీతో జుట్టును ఒత్తుగా సిల్కీ గా మార్చుకోవచ్చు.. తెలుసా?

జుట్టు ఒత్తుగా మరియు సిల్కీగా( Thick and Silky Hair ) మెరిసిపోతూ కనిపిస్తుంటే అందం మరింత రెట్టింపు అవుతుంది.

అందుకే ప్రతి ఒక్కరూ అలాంటి హెయిర్ కోసం తెగ ఆరాటపడుతూ ఉంటారు.

ఈ క్ర‌మంలోనే ఖరీదైన షాంపూ, కండిషనర్, ఆయిల్, సీరం వంటివి వాడడమే కాకుండా నెలకు ఒకసారైనా సెలూన్ కు వెళ్లి జుట్టు కోసం వేలకు వేలు ఖర్చు పెడుతుంటారు.కానీ పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే ఈజీగా ఇప్పుడు చెప్పబోయే రెమెడీతో జుట్టును ఒత్తుగా మరియు సిల్కీ గా మార్చుకోవచ్చు.

మరి లేటెందుకు ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ముల్తానీ మట్టి( Multani Mitti ) వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్, మూడు టేబుల్ స్పూన్లు మీ రెగ్యులర్ షాంపూ వేసుకుని బాగా మిక్స్ చేయాలి.చివరిగా ఒకటిన్నర గ్లాసు బియ్యం కడిగిన నీళ్లు వేసుకుని మరోసారి కలుపుకోవాలి.

Advertisement

ఇప్పుడు ఈ వాటర్ ను ఉపయోగించి శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.వారానికి రెండు సార్లు ఈ విధంగా షాంపూ చేసుకుంటే బోలెడు ప్రయోజనాలు పొందుతారు.

ముఖ్యంగా ముల్తానీ మట్టి మరియు రైస్ వాటర్ హెయిర్ రూట్స్ ను బలోపేతం చేస్తాయి.అలాగే స్కాల్ప్ ను హెల్తీ గా, క్లీన్ గా మారుస్తాయి.

చుండ్రు( Dandruff )ను పూర్తిగా నివారిస్తాయి.అదే సమయంలో హెయిర్ గ్రోత్ ను ఇంప్రూవ్ చేస్తాయి.

ఇక అలోవెరా జెల్ మీ జుట్టును సిల్కీగా మార్చడానికి ఎంతో ఉత్త‌మంగా సహాయపడుతుంది.అలాగే జుట్టు చిట్లడం, విరగడం వంటి సమస్యలకు సైతం అలోవెరా జెల్‌ అడ్డుకట్ట వేస్తుంది.కాబట్టి ఇంట్లోనే సులభంగా ఒత్తైన సిల్కీ హెయిర్( Silky Hair ) ను పొందాలని కోరుకునేవారు తప్పకుండా పైన చెప్పిన విధంగా షాంపూ చేసుకునేందుకు ప్రయత్నించండి.

ఓట్స్ ఆరోగ్యాన్నే కాదు హెయిర్ గ్రోత్ ను పెంచుతాయి.. ఇంతకీ ఎలా వాడాలంటే?
రూ.10 లక్షల విరాళం ప్రకటించినా రష్మికపై ట్రోల్స్.. అలా చేయడమే తప్పైందా?

మంచి రిజ‌ల్ట్ మీ సొంతం అవుతుంది.

Advertisement

తాజా వార్తలు