క‌రోనా త‌ర్వాత హెయిర్ ఫాల్ ఎక్కువ‌గా ఉందా? ఈ టిప్స్‌తో చెక్ పెట్టండి?!

అతి సూక్ష్మ‌జీవి అయిన క‌రోనా వైర‌స్ ప్ర‌జ‌ల ప్రాణాల‌తో ఏ విధంగా చ‌ల‌గాటం ఆడుతుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

ఈ ప్రాణాంత‌క వైర‌స్ కాటుకు ఇప్ప‌టికే ఎంద‌రో ప్రాణాలు పోగొట్టుకోగా.

మ‌రికొంద‌రు నానా ఇబ్బందులు ప‌డి మ‌హ‌మ్మారి బారి నుంచి బ‌య‌ట ప‌డుతున్నారు.అయితే క‌రోనా త‌గ్గిన త‌ర్వాత చాలా మందిలో హెయిర్ ఫాలింగ్‌ స‌మ‌స్య ఎక్కువ‌గా క‌నిపిస్తోంది.

ఈ హెయిర్ ఫాల్‌ను త‌గ్గించుకోవాలంటే.డైట్‌లో పోష‌కాహారం ఉండేలా చూసుకోవ‌డ‌మే కాదు కొన్ని కొన్ని హెయిర్ ప్యాక్స్‌ను కూడా పాటించాల్సి ఉంటుంది.

మ‌రి ఆ హెయిర్ ప్యాక్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో మూడు స్పూన్ల ఆముదుం, మూడు స్పూన్ల ఉల్లిపాయ ర‌సం మ‌రియు విట‌మిన్ ఇ టాబ్లెట్స్ రెండు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

Advertisement
How To Get Rid Of Hair Fall After Corona! Hair Fall, Hair Care, Corona Virus, Co

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని త‌ల‌కు, కేశాల‌కు ప‌ట్టించి.అర గంట పాటు ఆర‌నివ్వాలి.

అనంత‌రం కెమిక‌ల్స్ త‌క్కువ‌గా ఉండే షాంపూతో త‌ల స్నానం చేసేయాలి.ఇలా వారంలో రెండు సార్లు చేస్తే హెయిర్ ఫాలో త‌గ్గు ముఖం ప‌డుతుంది.

How To Get Rid Of Hair Fall After Corona Hair Fall, Hair Care, Corona Virus, Co

అలాగే ఒక గిన్నెలో ఎగ్ వైట్ వేసుకుని అందులో కొద్దిగా బాదం ఆయిల్ వేసి క‌లుపుకోవాలి.ఆ త‌ర్వాత త‌ల‌కు, కుదుళ్ల‌కు మ‌రియు జుట్టుకు ఈ మిశ్ర‌మాన్ని అప్లై చేసుకుంది.ఇర‌వై, ముప్పై నిమిషాల అనంత‌రం గోరు వెచ్చ‌ని నీటితో హెడ్ బాత్ చేయాలి.

నాలుగు రోజుల‌కు ఒక సారి ఇలా చేసినా హెయిర్ ఫాల్ త‌గ్గి.జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.

నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!

ఇక కొబ్బ‌రి పాల‌లో కొద్దిగా కొబ్బ‌రి నీళ్లు యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని త‌ల‌కు, కేశాలకు అప్లై చేసి.

Advertisement

ఒక గంట పాటు డ్రై అవ్వ‌నివ్వాలి.ఆ త‌ర్వాత తేలికపాటి షాంపూ ఉపయోగించి తలస్నానం చేయండి.

ఇలా చేసినా కూడా జుట్టు రాల‌డం త‌గ్గుతుంది.

తాజా వార్తలు