ఇంట్లో శంఖాన్ని ఎక్కడ పెట్టాలో తెలుసా?

మన పురాణాల ప్రకారం శంఖం సముద్రగర్భం నుంచి ఉద్భవించింది కనుక శంఖాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు.ఈ క్రమంలోనే శంఖం మన ఇంట్లో పెట్టుకొని పూజించడం ద్వారా సకల సంపదలు కలుగుతాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.

అయితే కొందరు శంఖాన్ని ఒక అలంకరణ వస్తువుగా పెట్టుకుంటారు.మరికొందరు దైవ సమానంగా భావించి దేవుని గదిలో ఉంచుకొని పూజలు నిర్వహిస్తారు.

మరి కొందరు మాత్రం శంఖం ఇంట్లో ఎక్కడ పెట్టుకుని పూజించాలనే సందిగ్ధంలో ఉంటారు.అయితే శంఖాన్ని ఎక్కడ పెట్టుకొని ఏ విధంగా పూజ చేయాలి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

శంఖం కొనాలనుకునేవారు వారికి ఇష్టమొచ్చినట్లు ఏది పడితే అది కొనకూడదు.శంఖాన్ని ఇంట్లో పెట్టుకున్నవారు ప్రతి రోజూ పూజలు చేయాలి.

Advertisement

శంఖం సాక్షాత్తు విష్ణుమూర్తికి నిదర్శనం కనుక నిత్యం శంకువుకి పూజలు చేయాలి.కొన్ని రోజులు పూజలు చేసిన మరికొన్ని రోజులు వదిలి పెట్టడం వల్ల మన ఇంట్లో పూర్తిగా ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి.

కనుక శంఖానికి నిత్యం పూజలు చేస్తూ ఎంతో పవిత్రంగా భావించాలి.శంఖంలో రెండు రకాలు ఉంటాయి ఒకటి నీటి శంఖం.

ఈ శంఖం దేవుని గదిలో ఎర్రటి వస్త్రం పై ఉంచి నిత్యం పూజలు చేస్తుండాలి.

ఈ నీటి శంఖంలో ఎల్లప్పుడు నీరు ఉండేలా చూసుకోవాలి.ఈ శంఖం దేవుని గదిలో విష్ణువు పాదాల చెంత ఉంచి పూజలు చేయాలి.మరొక శంఖం పూజ అనంతరం శంఖారావం చేయడానికి ఉపయోగిస్తారు.

సుందర్ పిచాయ్, సత్యనాదెళ్ల కంటే ఎక్కువ వేతనం .. భారత సంతతి సీఈవో అరుదైన ఘనత..!!
ఇంట్లో ఈ వస్తువులను ఖాళీగా పెడుతున్నారా..? అయితే దరిద్రం పట్టిపీడించడం ఖాయం..!

శంఖం కొనాలనుకునేవారు ఈ రెండు రకాల శంఖాలను కొని మన ఇంట్లో పెట్టుకోవాలి.అయితే రెండింటినీ ఒకే చోట కాకుండా ప్రత్యేకంగా పెట్టాలి.

Advertisement

ఈ విధంగా శంఖం కొని పూజించాలి అనుకునేవారు ఈ విధమైనటువంటి జాగ్రత్తలను పాటించడం వల్ల మన ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.

తాజా వార్తలు